Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesseract EV: సింగిల్ చార్జింగ్ పై 260 కిలోమీటర్ల రేంజ్.. అదరహో అనిపిస్తున్న టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఎప్పటి కప్పుడు కొత్త మోడళ్లు విడుదలవుతున్నాయి. ఒకదానికి మించి మరొకటి అనేక ప్రత్యేకతలతో సందడి చేస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అల్ట్రావైలెట్ నుంచి టెస్రాక్ట్ పేరుతో కొత్త స్కూటర్ విడుదలైంది. మిగిలిన వాటితో పోల్చితే దీనిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆధునిక ఇంజినీరింగ్ టెక్నాలజీ, సమకాలీన డిజైన్ సమ్మేళనంతో దీన్ని తయారు చేశారు. ఇతర స్కూటర్ల కంటే టెస్రాక్ట్ కు ఉన్న ఐదు ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

Tesseract EV: సింగిల్ చార్జింగ్ పై 260 కిలోమీటర్ల రేంజ్.. అదరహో అనిపిస్తున్న టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
Tesseract Electric Scooter
Follow us
Srinu

|

Updated on: Apr 08, 2025 | 4:45 PM

మన దేశంలో రాడార్ సహాయక ముందు, వెనుక డాష్ క్యామ్ లను కలిగిన మొదటి స్కూటర్ టెస్రాక్ట్. ఇది రియల్ టైమ్ రైడ్ పుటేజ్ ను రికార్డు చేస్తుంది. అడ్వాన్స్ డ్ రైడర్ టైమ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏఆర్ఏఎస్) కొలిషన్ అలారాలు, లేన్ చేంజ్ అసిస్టెన్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రైడర్ భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. స్కూటర్ లో 20.1 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటారు ఏర్పాటు చేశారు. గంటకు గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంగా పరిగెడుతుంది. దీనిలోని 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా సింగిల్ చార్జింగ్ పై సుమారు 260 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. వేగవంతమైన చార్జర్ తో గంట కంటే తక్కువ సమయంలో 80 శాతం బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు.

రైడర్ భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. రాడార్, డాష్ క్యామ్ వ్యవస్థలు చాలా ఉపయోగంగా ఉంటాయి. డ్యూయల్ చానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ తో సురక్షితమైన ప్రయాణం చేయవచ్చు. హ్యాండిల్ బార్ లపై హాప్టిక్ ఫీడ్ బ్యాక్, బ్లైండ్ స్పాట్ హెచ్చరికలు, స్మార్ట్ మిర్రర్లు అదనపు ప్రయోజనాన్ని అందిస్తాయి. స్కూటర్ లో ఏర్పాటు చేసిన ఆధునిక ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. దీనిలోని ఏడు అంగుళాల టీఎఫ్ టీ టచ్ స్క్రీన్ ద్వారా ఆన్ బోర్డు నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ పొందవచ్చు. హాప్టిక్ ఫీడ్ బ్యాక్ హ్యాండిల్ బార్లు, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, వైలెట్ ఏఐ ఇంటిగ్రేషన్ తో ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. సెల్ ఫోన్ ను చార్జింగ్ చేసుకునే అవకాశం, అండర్ సీటు స్టోరేజీలో హెల్మెట్ ను దాచుకోవచ్చు.

వారెవ్వా అనిపించే డిజైన్ తో టెస్రాక్ట్ స్కూటర్ ఆకట్టుకుంటోంది. యుద్ద హెలికాప్టర్ల నుంచి ప్రేరణ పొందిన షార్ప్ లేన్లు, డీఆర్ఎల్ లు, ట్విన్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు బాగున్నాయి. స్టీల్త్ బ్లాక్, సోనిక్ పింక్, డెసర్ట్ సాండ్ తదితర రంగులతో ఆకట్టుకుంటోంది. కీలెస్ యాక్సెస్, పార్క్ అసిస్ట్, హిల్ హూల్డ్ , క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..