Stock Markets: హమ్మయ్య కోలుకుంది.. భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు!
Stock Markets: డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నిన్న, భారత మార్కెట్ ప్రారంభమైన వెంటనే అది 3000 పాయింట్లు పడిపోయింది. 2024 ఎన్నికల తర్వాత ఒకే రోజులో ఇది అతిపెద్ద తగ్గుదల. నిన్న ఒక్కరోజు కేవలం 5 నిమిషాల్లోనే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత వరుసగా మూడు రోజులుగా క్షీణతను చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఇప్పుడు కోలుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతో ట్రేడైంది. అదే సమయంలో నిఫ్టీ కూడా 400 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 800 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 కూడా 1000 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ క్రమంలో మార్కెట్లో ఎక్కడ చూసినా కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. నిఫ్టీలోని యాభై స్టాక్స్ అన్నీ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమై దూసుకెళ్తున్నాయి. దీంతో అనేక మంది మదుపర్లు లాభపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా..?
డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నిన్న, భారత మార్కెట్ ప్రారంభమైన వెంటనే అది 3000 పాయింట్లు పడిపోయింది. 2024 ఎన్నికల తర్వాత ఒకే రోజులో ఇది అతిపెద్ద తగ్గుదల. నిన్న ఒక్కరోజు కేవలం 5 నిమిషాల్లోనే రూ.19 లక్షల కోట్ల నష్టాన్ని చూవి చూశారు ఇన్వెస్టర్లు. కానీ నేడు స్టాక్ మార్కెట్ తన గమనాన్ని మార్చుకుంది.
ఇది కూడా చదవండి: Trump Tariffs: ట్రంప్ సుంకాల ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నారా? వైట్ హౌస్ ప్రకటన ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి