Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!

Indian Railways: ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాలను అందించడమేనని నిపుణులు అంటున్నారు. అందువల్ల రైలుకు ఇరువైపులా లగేజ్ కోచ్‌లు ఉంటాయి. తరువాత జనరల్, స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో జనాలు రెండు గ్రూపులుగా విడిపోతారు..

Indian Railways: రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!
తత్కాల్ ఇ-టికెట్ ప్రస్తుత సమయాలు ఏమిటి?: ప్రయాణీకులు ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు బయలుదేరే స్టేషన్ నుండి ప్రయాణ రోజు మినహా, ఎంపిక చేసిన రైళ్లకు తత్కాల్ ఇ-టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. AC తరగతులకు (2A, 3A, CC, EC, 3E) IST ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతులకు (SL, FC, 2S) IST ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ AC మినహా అన్ని తరగతులకు తత్కాల్ సౌకర్యం అందుబాటులో ఉంది.
Follow us
Subhash Goud

|

Updated on: Apr 08, 2025 | 11:10 AM

భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది. దేశ సరిహద్దు ప్రాంతాలను పెద్ద నగరాలకు అనుసంధానించడానికి భారతీయ రైల్వేలు పనిచేస్తున్నాయి. భారతీయ రైల్వేలు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా విధానం. ఈ కారణంగా దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది దీని ద్వారా ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వేలకు సంబంధించి ఇలాంటివి చాలా ఉన్నాయి. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. భారతీయ రైళ్ల మధ్యలో AC కోచ్‌లు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. అంటే రైలు ఇంజిన్‌ తర్వాత జనరల్‌ కోచ్‌లు ఉంటాయి. ఆ తర్వాత ఏసీ కోచ్‌లు ఉంటాయి. మరి మధ్యలో ఏసీ కోచ్‌లు ఎందుకు ఏర్పాటు చేస్తారు?

భారతీయ రైళ్లలో జనరల్ కోచ్‌లు ఇంజిన్ తర్వాత జత చేస్తారు. ఆ తర్వాత మధ్యలో స్లీపర్ కోచ్‌లు, ఏసీ కోచ్‌లు ఉంటాయి. దీని తరువాత, స్లీపర్ కోచ్‌లు, దాని జనరల్ కంపార్ట్‌మెంట్‌లు మళ్లీ జత చేస్తారు. రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఉంచుతారో తెలుసుకుందాం.

మధ్యలో ఏసీ కోచ్‌ల ఏర్పాటుకు కారణాలు ఇవే..

ఈ నిర్ణయానికి భారత రైల్వేలు ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని పేర్కొనలేదు. కానీ సైంటిఫిక్‌ కారణం ఉంది. ఓ రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. స్లీపర్, ఏసీ కోచ్‌ల కంటే రైలు సాధారణ కోచ్‌ల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ కోచ్‌లల్లో ప్రతి స్టేషన్‌లో ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఎక్కుతుంటారు. దిగుతుంటారు. అందుకే ఏదైనా రైలు ముందు, వెనుక జనరల్ కంపార్ట్‌మెంట్లను ఉంచడం వల్ల ప్రయాణికుల రద్దీ సమానంగా విభజించేలా ఉంటుంది. ఇలా చేయకుంటే స్టేషన్ మధ్యలో జనం గుంపులు గుంపులుగా ఉంటే రైల్వే స్టేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. రైలు ముందు, వెనుక జనరల్ కోచ్‌లను ఉంచడం ద్వారా, రైలు బ్యాలెన్స్ కూడా సరిగ్గా ఉంటుంది. ఏ రైలులో అయినా సాధారణ కోచ్‌లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్యలో సాధారణ కోచ్‌లు ఉంటే మధ్యలో అధిక లోడ్‌తో రైలు మొత్తం బ్యాలెన్స్‌ దెబ్బతింటుంది.

దీని కారణంగా రైలు ఎక్కేప్పుడు, దిగేప్పుడు కూడా సమస్య ఉంటుంది. మధ్యలో జనరల్ కంపార్ట్ మెంట్ ఉండడంతో సీటింగ్ అరేంజ్‌మెంట్‌తో పాటు మిగిలిన ఏర్పాట్లు కూడా చెల్లాచెదురుగా ఉంటాయి. అందుకే ప్రయాణికుల సౌకర్యం కోసమే రైలు రెండు చివర్లో జనరల్‌ కోచ్‌లను ఏర్పాటు చేస్తుంది రైల్వే. మిగతావి ఏసీ బోగీలు కాబట్టి అవి మధ్యలో ఉంటాయి.

ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాలను అందించడమేనని నిపుణులు అంటున్నారు. అందువల్ల రైలుకు ఇరువైపులా లగేజ్ కోచ్‌లు ఉంటాయి. తరువాత జనరల్, స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో జనాలు రెండు గ్రూపులుగా విడిపోతారు. అందువల్ల మధ్యలో AC కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులు తక్కువ రద్దీని ఎదుర్కొంటారు. రెండవ కారణం ఏమిటంటే స్టేషన్ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు సాధారణంగా మధ్యలో ఉంటాయి. ఏసీ కోచ్‌ల ప్రయాణీకులు రైలు నుండి దిగిన తర్వాత ఈ గేట్‌ వద్దకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. రాక సమయంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళు లోపలికి వెళ్ళగానే వాళ్ళ కోచ్ ఎదురుగా ఉంటుంది.

వేగం:

  • రైలు వేగాన్ని పెంచడానికి AC కోచ్‌లను మధ్యలో ఉంచడం అవసరం.
  • గాలి, ధూళి కారణంగా నాన్-AC కోచ్‌లు రైలు వేగాన్ని తగ్గిస్తాయి.
  • 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలో నాన్-AC కోచ్‌లు సాంకేతిక, ఇతర సమస్యలను సృష్టిస్తాయి.

అగ్ని ప్రమాదాల బారిన పడకుండా..

ఇంజిన్ బోగీల పక్కనే ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేస్తే.. షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఒక వివరణ ఉంది. ఏసీ కోచ్‌లోని సదుపాయలన్నీ మంటలకు ఆజ్యం పోసేలా ఉంటాయి. ఈ కారణంగా కూడా ఏసీ బోగీలను రైలు మధ్యలో ఏర్పాటు చేశారని చెబుతుంటారు.

జనరల్ కంపార్ట్‌మెంట్ ప్రారంభంలో, చివరిలో ఎందుకు ఉంటుంది?

జనరల్ కంపార్ట్‌మెంట్లు చాలా రద్దీగా ఉంటాయి. అందువల్ల ఇవి ప్రారంభంలో, చివరిలో ఉంటాయి. ఈ బోగీల్లో అధిక రద్దీ ఉండటంతో స్టేషన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఇలా ఉంచుతారు. అందువల్ల రాజధాని, శతాబ్ది లేదా మరే ఇతర పూర్తి AC రైలులో కోచ్‌ల అమరిక దాదాపు ఒకే విధంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి