WhatsApp Drawing Tools: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్..ఇక నుంచి వాట్సప్ వెబ్‌లోనూ ఫోటో ఎడిట్ ఆప్షన్..!
WhatsApp Drawing Tools: వాట్సాప్ తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'డ్రాయింగ్ టూల్స్'..
WhatsApp Drawing Tools: వాట్సాప్ తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘డ్రాయింగ్ టూల్స్’ పేరుతో వాట్సప్ వెబ్ 2.2130.7 కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే.. ఈ కొత్త వర్షన్ వెబ్/ డెస్క్‌టాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ టూల్స్ ద్వారా వాట్సప్ వెబ్‌లోనూ ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. అయితే.. ఈ ఫీచర్ ఇప్పుడే అందరికీ అందుబాటులో ఉండదు. దీని బీటా వర్షన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది సంస్థ. ప్రస్తుతానికి ఈ ఫీచర్.. సంస్థ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. వాట్సప్ ఇప్పటికే వ్యూ వన్స్, న్యూ ఆర్కైవ్ అనే కొత్త ఫీచర్లను ఇటీవలే తీసుకొచ్చింది. తాజాగా.. వాట్సప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యూజర్లు ఫోటోలను ఎడిట్ చేసుకునే ఫీచర్ డ్రాయింగ్ టూల్స్‌ను తీసుకొచ్చింది.
ఇక నుంచి ఈ ఫీచర్ ద్వారా వాట్సప్ వెబ్‌లోనూ ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఎవరికైనా ఫోటోను షేర్ చేసేటప్పుడు.. ఆ ఫోటోను ఎడిట్ చేసే కొన్ని ఆప్షన్లను వాట్సప్ చూపిస్తుంది. ఆ ఫోటోకు ఎమోజీలు యాడ్ చేయడం, స్టిక్కర్స్, టెక్స్ట్ యాడ్ చేయడం లాంటివి.. ఇలా పలు ఎడిట్ ఆప్షన్లతో డ్రాయింగ్ టూల్స్ అనే ఆప్షన్‌ను వాట్సప్ తాజాగా తీసుకొచ్చింది. ఇప్పటికే.. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు వాట్సప్ ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ను తీసుకొచ్చింది కానీ.. అది కూడా బీటా వర్షన్‌లోనే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ ఫీచర్స్ కూడా సెలెక్టెడ్ యూజూర్లకు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.