Motorola Edge 20: మోటొరోలా ఎడ్జ్ 20 సిరీస్ ఫోన్ విడుదల.. 108 మెగాపిక్సెల్ కెమెరా.. ధర ఎంతంటే..!

Motorola Edge 20: మార్కెట్లో రోజురోజుకు అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లో విడుదలవుతున్నాయి. తాజాగా మోటొరోలా నుంచి కూడా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదలైంది. మోటొరోలా..

Motorola Edge 20: మోటొరోలా ఎడ్జ్ 20 సిరీస్ ఫోన్ విడుదల.. 108 మెగాపిక్సెల్ కెమెరా.. ధర ఎంతంటే..!
Motorola Edge 20
Follow us
Subhash Goud

|

Updated on: Aug 09, 2021 | 5:04 PM

Motorola Edge 20: మార్కెట్లో రోజురోజుకు అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లో విడుదలవుతున్నాయి. తాజాగా మోటొరోలా నుంచి కూడా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదలైంది. మోటొరోలా ఎడ్జ్ లైట్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించడం విశేషం. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు కూడా ఉన్నాయి. వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండటం విశేషం.

మోటొరోలా ఎడ్జ్ లైట్ ధర

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 యువాన్లుగా(సుమారు రూ.29,000) నిర్ణయించారు. అలాగే 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,899 యువాన్లుగా(సుమారు రూ.33,300) ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇక భారత్‌లో ఎప్పుడు విడుదల కానుందో ఇంకా స్పష్టత లేదు.

మోటొరోలా ఎడ్జ్ ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు:

ఆండ్రాయిడ్ 11 ఆధారిత మైయూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్‌ కానుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను పొందుపర్చారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 576 హెర్ట్జ్‌గానూ ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4020 ఎంఏహెచ్‌గా ఉండగా, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. 5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి

Samsung Galaxy A52s 5G: శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ వచ్చేస్తుంది.. 5జీతో అదిరిపోయే ఫీచర్స్‌..!

Xiaomi Mi Pad 5: షియోమి నుంచి మరో ఎంఐ ప్యాడ్.. అదిరిపోయే ఫీచర్స్‌.. పలు వేరియంట్లలో విడుదల..!

Hero Splendor: అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 22 వేల రూపాయలకే హీరో బైక్‌.. 81 కి.మీ మైలేజీ..!