Samsung Galaxy A52s 5G: శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ వచ్చేస్తుంది.. 5జీతో అదిరిపోయే ఫీచర్స్..!
Samsung Galaxy A52s 5G: పలు మొబైల్ తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త మోడళ్లలను స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో మార్కెట్లో విడుదలవుతున్నాయి..
Samsung Galaxy A52s 5G: పలు మొబైల్ తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త మోడళ్లలను స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో మార్కెట్లో విడుదలవుతున్నాయి. ఇక తాజాగా ప్రముఖ శాంసంగ్ నుంచి గెలక్సీ ఏ52ఎస్ 5జీ మోడల్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఇటీవలే గీక్ బెంచ్ వెబ్‌సైట్లో కూడా కనిపించింది. SM-A528B మోడల్ నంబర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ ఆన్‌లైన్‌లో కనిపించింది. అయితే మొబైల్ మార్కెట్లోకి రాకముందు సమాచారం ముందుగానే లీకవుతున్నాయి. లీకైన సమాచారం ప్రకారం.. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. దీని క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్‌గా ఉండనుంది. దీన్ని బట్టి ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. వన్‌యూఐ కోర్ 3.1 కోర్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఇందులో అందించనున్నారు. 8 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు. మరిన్ని ర్యామ్ వేరియంట్లు కూడా ఇందులో ఉండనున్నాయి.
అయితే ఈ ఫోన్ ఎప్పుడు విడులయ్యేది స్పష్టమైన తేదీ లేకపోయినా.. భారత్‌లో ఆగస్టు నెలలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మార్చిలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీకి తర్వాతి వెర్షన్‌గా, గెలాక్సీ ఏ52ఎస్ మార్కెట్లోకి రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్నిమైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
అలాగే ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉండనున్నాయి. ఇక ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించినట్లు లీకుల ద్వారా తెలుస్తోంది.