Xiaomi Mi 11: టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా విజేతలకు షియోమి గుడ్‌న్యూస్.. వారందరికీ గిఫ్ట్‌గా ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు..!
Xiaomi Mi 11: టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన వారికి షియోమి శుభవార్త చెప్పింది. ఒలింపిక్స్‌లో విజయం సాధించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. పతకం సాధించిన విజేతలకు..
Xiaomi Mi 11: టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన వారికి షియోమి శుభవార్త చెప్పింది. ఒలింపిక్స్‌లో విజయం సాధించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. పతకం సాధించిన విజేతలకు షియోమి స్మార్ట్‌ఫోన్‌లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మి11 అల్ర్టా స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇండియా పురుషుల హాకీ జట్టులోని ప్రతి వ్యక్తికి ఎంఐ11x స్మార్ట్‌ఫోన్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. Xiaomi Mi 11 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256 స్టోరేజీ ఉంటుంది. దీని ధర రూ.69,999 ఉండగా, Mi 11X సిరీస్‌లో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కలిగి ఉంటుంది. దీని ధర రూ.29,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128స్టోరేజీ మోడల్‌లో ధర రూ.31,999 ఉంది.
ఈ సందర్భంగా షియోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఒలింపిక్స్‌లో పతకం గెలవడానికి అవసరమైన పట్టుదల, అంకితభావానికి మేలు ఎంతో విలువ ఇస్తున్నామని, కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ బహుమతిగా అందిస్తున్నామని అన్నారు. ఒలంపిక్స్‌లో విజేతలుగా నిలిచిన నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, రవి కుమార్ దహియా, లవ్లినా బోర్గోహైన్, పీవీ సింధు, భజరింగ్ పునియా, పురుషుల హామీ టీమ్ సభ్యులందరికి షియోమి తరపున ఈ ఫోన్లను గిఫ్ట్‌గా అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఒలంపిక్స్‌లో విజేతలుగా నిలిచిన ఏడుగురికి స్మార్ట్‌ఫోన్‌లను అందించనున్నట్లు తెలిపారు.
We value the grit & dedication that it takes to win an #Olympics medal. ?
As a small gesture of thanks, we’ll humbly gift a #Mi11Ultra to all the Indian Olympic medal winners. Super phone for Super Heroes.❤️
You make us proud. #Respect ?#Olympics2021 #Tokyo2020 #TeamIndia pic.twitter.com/B5XxBDlKHg
— Manu Kumar Jain (@manukumarjain) August 8, 2021