AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debit Card EMI: ఈ బ్యాంకు డెబిట్‌ కార్డుతో ఈఎంఐ ఆప్షన్‌.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలన్నీ పొందవచ్చు..!

Debit Card EMI: సాధారణంగా మనకు బ్యాంకులు క్రెడిట్‌ కార్డులపై మాత్రమే ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. డెబిట్‌ కార్డులకు ఇవ్వవు. ఈ బ్యాంకు మాత్రం డెబిట్‌ కార్డుపై ఈఎంఐ..

Debit Card EMI: ఈ బ్యాంకు డెబిట్‌ కార్డుతో ఈఎంఐ ఆప్షన్‌.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలన్నీ పొందవచ్చు..!
Debit Card Emi
Subhash Goud
|

Updated on: Aug 15, 2021 | 6:35 PM

Share

Debit Card EMI: సాధారణంగా మనకు బ్యాంకులు క్రెడిట్‌ కార్డులపై మాత్రమే ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. డెబిట్‌ కార్డులకు ఇవ్వవు. ఈ బ్యాంకు మాత్రం డెబిట్‌ కార్డుపై ఈఎంఐ ఆప్షన్‌ అందిస్తోంది. అదే కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌. ఈ బ్యాంకు డెబిట్‌ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే అత్యవసర సమయాల్లో ఆర్ధికంగా ఆదుకునేది క్రెడిట్‌ కార్డులే. వాటిని వాటిని సరిగా వాడుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు ఆ కార్డులపై అవగాహన ఉండి సరైన పద్దతిలో మితంగా వాడుకుంటే మంచిది. పరిధి దాటితే చివరికి అప్పులు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో అవసరం లేకుండా ‘కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్’ స్కీమ్‌ లో భాగంగా డెబిట్‌ కార్డ్‌తో షాపింగ్‌ చేస్తే క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలు అందిస్తోంది. అంటే డెబిట్‌ కార్డుతో చేసిన బిల్లును ఈఎంఐలుగా మార్చుకుని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది.

► ‘కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్’ స్కీమ్‌లో వినియోగదారులు ఫ్యాషన్‌ యాక్ససరీస్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు. షాపింగ్‌కి సంబంధించిన బిల్లును డెబిట్‌ కార్డు ద్వారా పే చేస్తూ వాటిని ఈఎంఐగా మార్చుకోవచ్చు.

► కస్టమర్లు ఈఎంఐ ఆప్షన్‌ పొందాలంటే తప్పని సరిగా రూ.5,000లకు పైగా షాపింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని కల్పించినందుకు ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదని కొటక్‌ బ్యాంక్‌ ప్రతినిధులు తెలిపారు.

► వినియోగదారులు ఆఫ్‌ లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో డెబిట్‌ కార్డుతో రూ.5 వేల వరకు షాపింగ్‌ చేసుకోవచ్చు. మీరు డెబిట్‌ కార్డ్‌ ఈఎంఐకి అర్హులా? కాదా అనేది బ్యాంక్‌ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు.

► మీరు డెబిట్‌ కార్డ్‌ ఈఎంఐకి అర్హులైతే బ్యాంక్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అనంతరం మీ లావాదేవీలను రివ్వ్యూ చేసి మీకు ఈఎంఐ ఆప్షన్‌ను ఎన్ని నెలలు ఇవ్వాలనేది బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంటుంది.

► మీకు బ్యాంక్‌ కల్పించిన ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే రిక్వెస్ట్‌ చేయాలి. అపై మీకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి ఈఎంఐగా మార్చుకునే అవకాశం ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఈఎంఐలో భాగంగా ఆటో మెటిక్‌గా మీ బ్యాంకు ఖాతా నుంచి మీరు ఎంత ఈఎంఐ చెల్లిస్తారో అంతే డెబిట్‌ అవుతుంది.

ఇవీ కూడా చదవండి

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!

Voter ID Address Change: మీ ఓటర్‌ ఐడీ కార్డులో అడ్రస్‌ తప్పుగా ఉందా..? అయితే మార్చుకోండిలా..!

Jeff Bezos: కొంపముంచిన జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షయానం.. గుడ్‌బై చెబుతున్న అమెజాన్ యూజర్లు.. ఎందుకంటే.!

సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
నువ్వేకావాలి ఫస్ట్ మహేష్‌తో తీద్దామనుకున్నాం.. కానీ అసలు జరిగింది
నువ్వేకావాలి ఫస్ట్ మహేష్‌తో తీద్దామనుకున్నాం.. కానీ అసలు జరిగింది
నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..
నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..