మీ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ కూడా నమోదు చేయాలి. ఆ తర్వాత ఫోటో, అడ్రస్ ప్రూఫ్, వయస్సు ధృవీకరణ పత్రం లాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. వేరే నియోజకవర్గంలోకి అడ్రస్ మార్చాలనుకుంటే Form 6, ఒకే నియోజకవర్గంలో అడ్రస్ మారితే Form 8A డౌన్‌లోడ్ చేయాలి. ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి మీ సమీపంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో అందజేయాలి.