- Telugu News Photo Gallery Business photos Uidai aadhaar card how to verify aadhaar number of tennant aadhaar number
Aadhaar Card: మీ ఇంట్లో అనుమానస్పద వ్యక్తులు అద్దెకు ఉంటున్నారా..? వారి ఆధార్ నకిలీదా? కాదా..? గుర్తించండిలా
Aadhaar Card: ప్రస్తుతం అవసరమయ్యే డాక్యుమెంట్లలో అన్నింటికి ఆధార్ కార్డే ముఖ్యమైపోయింది. పలు ప్రాంతాల్లో కొందరు అనుమానస్పద వ్యక్తులు అద్దెకు దిగుతున్నారు..
Updated on: Aug 16, 2021 | 9:04 AM

Aadhaar Card: ప్రస్తుతం అవసరమయ్యే డాక్యుమెంట్లలో అన్నింటికి ఆధార్ కార్డే ముఖ్యమైపోయింది. పలు ప్రాంతాల్లో కొందరు అనుమానస్పద వ్యక్తులు అద్దెకు దిగుతున్నారు. వారు ఏం పనులు చేస్తారో.. ఎవ్వరికి తెలియదు. మోసగాళ్లు, దొంగలు ఇలా రకరకాల వ్యక్తులు అద్దె ఇళ్లలో ఉంటూ వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను వారు ఎలాంటి వారే గుర్తించడం మంచిదని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

అయితే అలాంటి అనుమానస్పద వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి అద్దె ఇళ్లల్లో ఉంటూ వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. అద్దెకు ఉంటున్నవారి ఆధార్ కార్డును పరిశీలించి వారి ఆధార్ నకిలీదా..? నిజమైనదా ..? అని గుర్తించడం ఎంతో ముఖ్యం. ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వ్యక్తుల ఆధార్ కార్డు నకిలీదా..? లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

తాజాగా ఆధార్‌కు సంబంధించిన అనేక కేసులు తెరపైకి వస్తున్నాయి. మీ పేరుపై కూడా ఇతరులు నకిలీ ఆధార్ కార్డు సృష్టించే ప్రమాదం ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలని యూఐడీఏఐ వినియోగదారులను హెచ్చరిస్తుంది. మీ ఆధార్ కార్డు నకిలీదా లేదా నిజమైనదా ఒక్కసారి చెక్ చేసుకోండని సూచిస్తుంది.

UADAI తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆధార్ మోసం గురించి ప్రజలను హెచ్చరించింది. ఆధార్ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏజెన్సీ తెలిపింది. మీ ఆధార్ నిజమైనదా, నకిలీదా అని మీరు ఎలా తనిఖీ చేయవచ్చో ట్విట్టర్ ద్వారా తెలిపింది. పూర్తిగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డును ధృవీకరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

ఈ రెండు మార్గాల్లో మీరు ఆధార్‌కు సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కారం పొందవచ్చు. ఆధార్ ఆఫ్‌లైన్‌లో తనిఖీ చేయడానికి దాని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని యుఐడిఎఐ తెలిపింది. ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి, రెసిడెంట్.యూడై.గోవ్.ఇన్ / వెరిఫై లింక్‌ను సందర్శించడం ద్వారా 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే తెలిసిపోతుంది వారి ఆధార్ కార్డు నకిలీదా..? లేదా అనేది. మీకు కావాలంటే ఈ పనిని m-Aadhaar యాప్ ద్వారా కూడా చేయవచ్చు.





























