RBI News: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. బ్యాంకు లైసెన్స్‌లు రద్దు.. ఆ మూడు బ్యాంకులకు భారీ జరిమానా

Bank Licence Cancels: నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొరఢా ఝులిపిస్తోంది. అలాంటి బ్యాంకులపై కఠిన చర్యలు చేపడుతోంది...

RBI News: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. బ్యాంకు లైసెన్స్‌లు రద్దు.. ఆ మూడు బ్యాంకులకు భారీ జరిమానా
Follow us
Subhash Goud

|

Updated on: Aug 14, 2021 | 4:57 PM

Bank Licence Cancels: నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొరఢా ఝులిపిస్తోంది. అలాంటి బ్యాంకులపై కఠిన చర్యలు చేపడుతోంది. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తోంది. సహకార బ్యాంకుల్లో తమ నగదు మొత్తాలు, బంగారు ఆభరణాలను దాచుకునే డిపాజిటర్లకు రక్షణ కల్పించే విషయంలో రాజీ పడటం లేదు. తాము రూపొందించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను ఉల్లంఘించిన కోఆపరేటివ్ బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. వాటి లైసెన్సులను రద్దు చేస్తోంది. ఇదివరకు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌ లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్బీఐ.. ఇక తాజాగా మరో సహకార బ్యాంక్‌ పైనా కొరఢా ఝులిపించింది. మహారాష్ట్రలోని పన్వెల్‌లో గల కర్నాల్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ లావాదేవీలను రద్దు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఆ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. దీనితోపాటు మహారాష్ట్ర కోఆపరేటివ్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్‌కు ఓ సర్కులర్‌ను జారీ చేసింది. కర్నాల నగరి సహకారి బ్యాంక్ లావాదేవీలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తర్వులను జారీ చేయాలని సూచించింది. అలాగే లిక్విడేటర్‌ను కూడా అపాయింట్ చేయాలని విజ్ఞప్తి చేసింది.

డిపాజిటర్లు నష్టపోతారనే కారణంతో లైసెన్స్‌ రద్దు..

ఆయితే బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949లోని సెక్షన్‌ 1 (1), సెక్షన్‌ 22 (3) (డీ) కింద బ్యాంకు యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌లోని పలు సెక్షన్లను ఉల్లంఘించినట్లు గుర్తించామని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనిని కొనసాగించడం వల్ల డిపాజిటర్లు నష్టపోతారనే కారణంగా లైసెన్స్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని రిజర్వ్‌ బ్యాంక్‌ వివరణ ఇచ్చింది.

మూడు సహకార బ్యాంకులపై జరిమానా

ఆర్బీఐ నిబంధనలు పాటించనందుకు మూడు సహకార బ్యాంకులపై భారీ జరిమానా విధించింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ బ్యాంక్‌ మర్యాదిత్‌ (మధ్యప్రదేశ్‌ రాజ్య సహకారి బ్యాంక్‌ మర్యాదిత్‌) భోపాల్‌, అలాగే ది గ్రేటర్‌ బాంబే కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ముంబై.. ఒక్కో బ్యాంకుకు రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించగా, మహారాష్ట్రలోని సహకార బ్యాంకు జల్నాలోని జల్నా పీపుల్స్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్బీఐ రూ.50 లక్షల వరకు జరిమానా విధించింది.

అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిఘా పెడుతోంది. ఆర్బీఐ విధించిన నిబంధనలు పాటించని బ్యాంకులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్స్‌లు రద్దు చేయడమే కాకుండా భారీ మొత్తంలో జరిమానా విధించింది. వినియోగదారులకు సరైన సేవలు అందించకుండా వడ్డీ రేట్లలో, ఇతర సేవల్లో నిబంధనలు పాటించకుండా వ్యవహరించడంతో ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. అయితే బ్యాంకుల లైసెన్స్‌లు రద్దు చేస్తున్న ఆర్బీఐ.. కస్టమర్ల ఖాతాలపై ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తోంది. డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు, కరెంట్‌ అకౌంట్లు ఉన్న ఖాతాదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతోంది. వారి డబ్బులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా వారికి అందే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. అయితే ఇలాంటి సమయాల్లో బ్యాంకుల లైసెన్స్‌లు రద్దు కావడంతో ఆ బ్యాంకు ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. తాము డిపాజిట్‌ చేసుకున్న డబ్బుల పరిస్థితి ఏమిటని టెన్షన్‌ పడుతుండగా, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ఆర్బీఐ చెబుతోంది.

ఇవీ కూడా చదవండి

Jewellery Online Order: ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేస్తున్నారా..? ఇవి తప్పకుండా తెలుసుకోండి.!

Children Savings Accounts: పిల్లలపై పొదుపు ఖాతాలు అందించే బ్యాంకులు.. ఈ అకౌంట్ల ద్వారా వివిధ రకాల లాభాలు..!

Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఆదాయపు పన్ను శాఖ