Bank FD: ఈ బ్యాంకు మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ.. ఆగస్టు 16 వరకు అవకాశం..!

Bank FD: ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంకు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందే అవకాశాన్ని కల్పిస్తోంది. డీసీబీ బ్యాంకు పరిమితల..

Bank FD: ఈ బ్యాంకు మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ.. ఆగస్టు 16 వరకు అవకాశం..!
Bank Fd
Follow us
Subhash Goud

|

Updated on: Aug 14, 2021 | 5:29 PM

Bank FD: ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంకు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందే అవకాశాన్ని కల్పిస్తోంది. డీసీబీ బ్యాంకు పరిమితల కాల వ్యవధికి మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD)పై సంవత్సరానికి 7.11 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ఆగస్టు 16 వరకు, లేదా అంతకు ముందు బుక్‌ చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఒక సమయంలో భద్రత, లిక్విడిటీని అందించే సేవలకు అనకూలమైన పెట్టుబడి. డీసీబీ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కోసం బ్రాంచ్‌ను సందర్శించి బుక్‌ చేసుకోవచ్చని బ్యాంకు అధికారులు తెలిపారు. లేదా వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా కస్టమర్లు బుక్‌ చేసుకోవచ్చు.

ముందుగానే ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి

ఏ భారతీయ పౌరుడైనా డీసీబీ బ్యాంకు ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఎంచుకోవచ్చు. డీసీబీ బ్యాంకులో పొదుపు ఖాతా తెరవకుండానే ఆన్‌లైన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సౌకర్యం పొందవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా తెరవచ్చని, ఇతర బ్యాంకు నుంచి డీసీబీ బ్యాంకుకు డబ్బులను బదిలీ చేసి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాను ఓపెన్‌ చేయండని బ్యాంకు అధికారులు తెలిపారు. కాగా, డీసీబీ ప్రైవేటు లిమిటెడ్‌ అనేది 354 శాఖలతో కూడిన ఒక ప్రైవేటు రంగ బ్యాంకు. ఈ బ్యాంకు 10,00,000 కంటే ఎక్కువ కస్టమర్లను కలిగి ఉంది.

కొత్త వడ్డీ రేట్లు:

డీసీబీ బ్యాంకు మే నెలలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది. డీసీబీ బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే ఎఫ్‌డీలను అందిస్తుంది. అలాగే 7 రోజుల నుంచి 14 రోజుల మధ్య మెచ్యూరిటీతో ఎఫ్‌డీలపై 4.55 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక 91 రోజుల నుంచి 6 నెలల మధ్య ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5.25 శాతం, బ్యాంకు ఆరు నెలల నుంచి 12 నెలల కన్న తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5.70 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే .. అయితే వినియోగదారులకు మరింత మేలు చేకూర్చే విధంగా వివిధ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఇలాంటి డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ మేలు చేకూరుస్తున్నాయి.

సాధారణ కస్టమర్లకే కాకుండా సీనియర్‌ సిటిజన్స్‌కు కూడా ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అందుకు బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేసిన కస్టమర్లకు అధికంగా రాబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే కాకుండా ఇతర ఇన్వెస్ట్‌మెంట్లపై కూడా మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి పలు బ్యాంకులు. ఎవరికి వారు పోటాపోటీగా కస్టమర్లను మరింతగా రాబట్టుకునేందుకు వడ్డీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి

RBI News: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. బ్యాంకు లైసెన్స్‌లు రద్దు.. ఆ మూడు బ్యాంకులకు భారీ జరిమానా

Jewellery Online Order: ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేస్తున్నారా..? ఇవి తప్పకుండా తెలుసుకోండి.!

Children Savings Accounts: పిల్లలపై పొదుపు ఖాతాలు అందించే బ్యాంకులు.. ఈ అకౌంట్ల ద్వారా వివిధ రకాల లాభాలు..!