AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video : తన భర్త మరో మహిళతో సంబంధం కొనసాగించడం ఏ భార్యకు ఇష్టం ఉండదు. ఇది అనేక సార్లు రుజువైంది. దీనివల్ల కుటుంబ కలహాలు

Viral Video : భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video
uppula Raju
| Edited By: |

Updated on: Aug 17, 2021 | 6:17 AM

Share

Viral Video : తన భర్త మరో మహిళతో సంబంధం కొనసాగించడం ఏ భార్యకు ఇష్టం ఉండదు. ఇది అనేక సార్లు రుజువైంది. దీనివల్ల కుటుంబ కలహాలు మొదలై చివరకు భార్యభర్తలు విడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా కొంతమంది మగవారి బుద్ది మారదు. తాజాగా ఔరంగాబాద్‌లో ఓ వ్యక్తి పరాయి స్త్రీతో ఉన్నప్పుడు అతడి భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోను చూసిన చాలామంది వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

వీడియోలో ఓ హోటల్‌ ముందు కారు పార్కింగ్‌ చేసి ఉంది. ఇంతలో ఓ మహిళ ఆ కారు వద్దకు వేగంగా పరుగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే కారులోపల ఉన్న మరో మహిళను బయటకు లాగి కొట్టడం ప్రారంభిస్తుంది. ఆ మహిళ ముసుగు ధరించి ఉంటుంది. అయితే ముసుగు తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆమె భర్త అడ్డుగా వస్తాడు. ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ప్రియురాలిని భార్య నుంచి కాపడటానికి ఎదుట ఉన్న మరో వ్యక్తి సాయాన్ని కోరుతాడు. ముసుగు ధరించిన స్త్రీ ‘యే కౌన్ హై’ అంటూ అరుస్తుంటుంది. దీనిని వీడియోలో మనం స్పష్టంగా చూడవచ్చు.

వీడియోలో భాగంగా అక్కడున్న పరిస్థితిని చూసినట్లయితే గొడవ చేసిన మహిళ భర్త, కారులో కూర్చున్న స్త్రీ ఇద్దరు బహుశా హోటల్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలో అతడిపై అనుమానం ఉన్న భార్య అతడిని ఫాలో చేసింది. దీంతో ఇద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ హై వోల్టేజ్ డ్రామా తెరకెక్కుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడ చాలామంది గుమిగూడారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. గొడవ చేసిన మహిళ పట్ల చాలామంది సానుభూతి వ్యక్తం చేశారు. అతేవిధంగా కారులో స్త్రీని కొట్టే బదులు ముందు భర్తను అదుపులో పెట్టుకోవాలని కొంతమంది కామెంట్ చేశారు.

IND vs ENG 2nd Test : లార్డ్స్‌లో దుమ్మురేపిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం..

Flower Farming: ఆయనది ఇప్పుడు పూల బాట.. ఏడాదికి లక్షలు ఆర్జిస్తున్న ఆదర్శ రైతు.. ఎలానో తెలుసా..

Zodiac Signs: మీకు నచ్చిన వ్యక్తి ఈ రాశిలో ఉన్నారా? అయితే వారు మిమ్మల్ని వెంటనే ప్రేమించేస్తారు..ఏ రాశివారంటే..