IND vs ENG 2nd Test : లార్డ్స్‌లో దుమ్మురేపిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం..
IND vs ENG 2nd Test : లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ని భారత
IND vs ENG 2nd Test : లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ని భారత బౌలర్లు ఒక్కసారిగా మార్చేశారు. ఇంగ్లాండ్‌ని కేవలం 120 పరుగులకే కట్టడి చేశారు. 151 పరుగుల తేడాతో భారత్‌కి ఘన విజయం అందించారు. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఐదో రోజు 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ని భారత్ కోలుకోలేని దెబ్బ తీశారు. కెప్టెన్ జోరూట్ 33 పరుగులు, చివర్లో బట్లర్ 25 పరుగులు చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో అదరగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లతో రాణించారు.
ఓవర్‌నైట్ స్కోర్ 181/6 తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. జస్ప్రిత్ బుమ్రా 34 పరుగులు, మహ్మద్ షమి హాఫ్ సెంచరీ చేశారు. అనంతరం రిషభ్ పంత్ 22 పరుగులకే వెనుదిరిగాడు. కాసేపటికే జట్టు స్కోరు 209 వద్ద ఇషాంత్ శర్మ 16 పరుగులు వికెట్లముందు దొరికిపోయాడు. అనంతరం జోడీ కట్టిన షమి, బుమ్రా సింగిల్స్ తీస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఇద్దరు నాటౌట్‌గా నిలిచి 89 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దీంతో భారత్ చివరికి 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆపై భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ తొలి ఓవర్ నుంచే వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ గెలిచిన వెంటనే తెలంగాణ మంత్రి కేటీఆర్ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
What a win & what an amazing test match!! Brilliant show Team ??
Kudos to the killer pace attack; our own Hyderabad lad Siraj ? Shami & Bumrah with both ball & bat, consistency of Ishant
Really love the drama that test cricket is & cherish beating England at lords ?
— KTR (@KTRTRS) August 16, 2021
WHAT. A. WIN! ? ?
Brilliant from #TeamIndia as they beat England by 1⃣5⃣1⃣ runs at Lord’s in the second #ENGvIND Test & take 1-0 lead in the series. ? ?
Scorecard ? https://t.co/KGM2YELLde pic.twitter.com/rTKZs3MC9f
— BCCI (@BCCI) August 16, 2021