AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: మీకు నచ్చిన వ్యక్తి ఈ రాశిలో ఉన్నారా? అయితే వారు మిమ్మల్ని వెంటనే ప్రేమించేస్తారు..ఏ రాశివారంటే..

కొంతమంది అది అమ్మాయిలు కావచ్చు.. అబ్బాయిలు కావచ్చు.. సులభంగా ప్రేమలో పడిపోతారు. వారు అవతలి వారు చెప్పే చిన్న చిన్న మాటలకే ఆకర్షితం అయిపోతారు.

Zodiac Signs: మీకు నచ్చిన వ్యక్తి ఈ రాశిలో ఉన్నారా? అయితే వారు మిమ్మల్ని వెంటనే ప్రేమించేస్తారు..ఏ రాశివారంటే..
Zodiac Signs
KVD Varma
|

Updated on: Aug 16, 2021 | 10:08 PM

Share

Zodiac Signs: కొంతమంది అది అమ్మాయిలు కావచ్చు.. అబ్బాయిలు కావచ్చు.. సులభంగా ప్రేమలో పడిపోతారు. వారు అవతలి వారు చెప్పే చిన్న చిన్న మాటలకే ఆకర్షితం అయిపోతారు. భావోద్వేగాలను అస్సలు దాచుకోలేరు. వారెప్పుడు అందరినీ తమలానే ఉంటారని అనుకుంటారు. అందుకే ఎదుటివారు ఏ ఉద్దేశ్యంతో ఉన్నా సరే.. వారికీ మంచిగా అనిపిస్తే వారు ఠక్కున ప్రేమలో పడిపోతారు. ఇటువంటి వారిని ప్రేమలో పడకుండా ఆపడం చాలా కష్టం.

ఇక జ్యోతిష శాస్త్రంలో ఇటువంటి వారికోసం ప్రత్యేకంగా చెప్పారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారు స్వతహాగానే సులభంగా ప్రేమలో పడిపోయేవారుగా ఉంటారట. వారి రాశి చక్రాన్ని అనుసరించి వారికీ పుట్టుకతోనే ఆ విధానం వచ్చేసిందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. రాశిచక్రాన్ని అనుసరించి సులభంగా ప్రేమలో పడిపోయే ఐదు రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కర్కాటకం 

కర్కాటక రాశి వ్యక్తులు అత్యంత భావోద్వేగంతో ఉంటారు. ఎవరికైనా తీపి హావభావాలతో సులభంగా కరిగిపోతారు. ప్రేమలో పడటానికి వారికి ఒక వారం కూడా పట్టదు. అది మాత్రమే కాదు, వారు చాలా తక్కువ సమయంలోనే ఆ వ్యక్తితో బాగా కలిసిపోతారు. అయితే ఈ రాశివారికి తాము ప్రేమించిన వారితో విబేధాలు వస్తే వెంటనే విడిపోతారు. 

తులారాశి

తులా రాశి వ్యక్తులు అత్యంత సానుకూల, శక్తివంతమైన, సంతోషకరమైన మనసుతో ఉంటారు. ఇతరుల మంచి ప్రవర్తనతో వారు సులభంగా సంతోషపడతారు. అదేవిధంగా, వారు కూడా సులభంగా ప్రేమలో పడవచ్చు. వారు చాలా నమ్మకమైన వ్యక్తులు, వారు ఎల్లప్పుడూ తమ భాగస్వామికి అంకితభావంతో ఉంటారు.

మేషం

మేషరాశి వారు తమకు ఏదైనా మంచి చేసే వ్యక్తితో వారు సులభంగా ప్రేమలో పడతారు. వారు రిస్క్ తీసుకునేవారు.  ధైర్యవంతులైన వ్యక్తులు. అంతే ధైర్యంగా ఉండే వారిని సులభంగా ఆకర్షిస్తుంటారు.

మీనం

మీనరాశి ప్రజలు పగటి కలలు కనేవారు. వారు తమ ఊహల ప్రపంచంలో త్వరగా పోతారు. అందువల్ల, వారు ఒకరి మంచి ప్రవర్తనను వారి పట్ల ప్రేమగా సులభంగా అర్థం చేసుకుంటారు. దీంతో  మీనరాశివారు  సులభంగా ప్రేమలో పడతారు.

సింహ రాశి 

సింహ రాశి వ్యక్తులు దృష్టిని కోరుకుంటారు. అందువల్ల, వారు తనను జాగ్రత్తగా చూసుకుంటున్న వారిపై వెంటనే ప్రేమలో పడిపోతారు. వీరి ప్రేమ చాలా గాఢంగా ఉంటుంది. తమ ప్రేమను కాపాడుకోవడానికి చాలా కష్టపడటం ఈ రాశివారి ప్రత్యేక లక్షణం. 

గమనిక- ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు , జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 

Also Read: Zodiac Signs: ఈ రాశుల వారు జీవిత భాగస్వామితో అబద్ధాలు చెబుతారు.. ఆ లిస్టులో మీరాశి ఉందేమో చూసుకోండి!

Zodiac Signs: నిద్రపట్టకపోవడానికీ..మీ రాశికీ సంబంధం ఉంటుంది.. ఈ రాశుల వారికి నిద్ర తక్కువగానే ఉంటుంది!

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..