Horoscope Today: ఆ రాశుల వారికి అనుకూల ఫలితాలు.. సోమవారం రాశిఫలాలు..

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే

Horoscope Today: ఆ రాశుల వారికి అనుకూల ఫలితాలు.. సోమవారం రాశిఫలాలు..
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2021 | 6:41 AM

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. సోమవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..

మేష రాశి: ఈ రాశివారికి కుటుంబసభ్యుల అవసరాలు కలుగుతాయి. మనోబలం తగ్గకుండా ముందుకుసాగాలి. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృషభ రాశి: ఈ రోజు ఈ రాశివారు పనిచేసే రంగాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మానసికంగా ధృఢంగా ఉంటారు. కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుతారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో స్థిరమైన ఫలితాలను సాధిస్తారు. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేస్తారు. విందు, శుభ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

సింహారాశి: ఈ రోజు ఈ రాశి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కన్యరాశి: ఈ రాశి వారు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. కుటుంబసభ్యులు, పెద్దల ప్రశంసలు లభిస్తాయి. ఆచితూచి అడుగేయడం మంచిది.

తులారాశి: ఈ రాశివారు పనితీరుకు సంబంధించి ప్రశంసలు అందుకుంటారు. విందు, పలు కార్యాల్లో బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు, కుటుంబసభ్యులతో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మిత్రులు, కటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆనందంగా గడుపుతారు.

ధనస్సురాశి: ఈ రాశి వారు పనులను, పలు కార్యాలను ఏకాగ్రతతో చేపట్టాలి. కుటుంబసభ్యులు, బంధువుల సహకారం లభిస్తుంది. కానీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

మకరరాశి: ఈ రోజు ఈ రాశి వారు.. కొన్ని వ్యవహారాలలో ఆచితూచి అడుగులేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.

కుంభరాశి: ఈ రాశివారి పనులకు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ.. మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. కొన్ని కార్యాలకు ఆర్థిక సాయం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీనరాశి: ఈ రాశి వారు కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సాయం వలన మేలు జరిగే అవకాశం ఉంది.

Also Read:

Shocking Video: వీడి వయస్సు ఏడాది మాత్రమే.. ఆరు అడుగుల గేటు ఈజీగా ఎక్కేశాడు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Ramya Murder: రమ్యను హత్య చేసిన శశికృష్ణను అరెస్ట్ చేశాం.. కఠినంగా శిక్షిస్తాం : డీజీపీ గౌతమ్ సవాంగ్

గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..