వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒకటిన్నర వయస్సు కలిగిన పిల్లవాడు.. డైపర్ ధరించి ఉన్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుడా ఇంట్లో ఉన్న ఆరు అడుగుల గేట్‌ను సునాయాసంగా ఎక్కేశాడు. అంతే సునాయాసంగా ఇవతలివైపు నుంచి అవతలి వైపునకు దిగాడు. అంతేకాదు.. ఆ పిల్లాడు తనకు ఎలాంటి హానీ జరగకుండా పూర్తి జాగ్రత్తవహించాడు. ఆ చిన్నోడు అలా గేట్ ఎక్కి దిగడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. కాగా, పిల్లాడు గేటు ఎక్కి దిగుతుండగా.. అక్కడే ఉన్నవారు వీడియో తీశారు.
ఆ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజంగా షాకింగ్‌గా ఉందని, నమ్మలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ఈ పిల్లాడు.. ఒక ప్రొఫెషనల్ మాదిరిగా గేటు ఎక్కి దిగుతున్నాడని నెటిజన్లు కామెంట్ మెన్షన్ చేశారు. మరెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
Also read:
Bhishma-Bhima: గంగా స్నానం.. గంగలో అస్థికలు కలపడానికి గల పరమార్ధాన్ని భీముడికి చెప్పిన భీష్ముడు
Viral Video: పిల్లలు కాదు చిచ్చర పిడుగులు.. ‘లోకల్ మేడ్ సూపర్ బైక్’పై ఎలా దూసుకెళ్తున్నారో చూడండి..
Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు.. దేశీయంగా స్థిరంగా కొనసాగుతున్న సిల్వర్ ధరలు.!