Bhishma-Bhima: గంగా స్నానం.. గంగలో అస్థికలు కలపడానికి గల పరమార్ధాన్ని భీముడికి చెప్పిన భీష్ముడు

Bhishma-Bhima: అష్టవసువులలో అగ్రగణ్యుడు.. గంగాపుత్రుడవు భీష్ముడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడి అంపశయ్యమీద ఓఘవతీ తీరంలో పడి ఉన్నాడు. ఆ సమయంలో భీష్ముడు పాండవులకు..

Bhishma-Bhima: గంగా స్నానం.. గంగలో అస్థికలు కలపడానికి గల పరమార్ధాన్ని భీముడికి చెప్పిన భీష్ముడు
Bhishma
Follow us
Surya Kala

|

Updated on: Aug 16, 2021 | 6:31 AM

Bhishma-Bhima: అష్టవసువులలో అగ్రగణ్యుడు.. గంగాపుత్రుడవు భీష్ముడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడి అంపశయ్యమీద ఓఘవతీ తీరంలో పడి ఉన్నాడు. ఆ సమయంలో భీష్ముడు పాండవులకు ఎన్నో నీతికథలను చెప్పాడు. విష్ణు సహస్రనామాలు కూడా భీష్ముడు అంపశయ్యమీద ఉన్న సమయంలోనే చెప్పాడు. క్షత్రియుడిగా జన్మించి బ్రహ్మచర్యం అవలంబించి రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి అరుదైన వ్యకిత్వం కలిగి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన గంగా మహత్యం గురించి ఈరోజు తెలుసుకుందాం..

గంగా, యమునా, సరస్వతిలు కలిసిన సంగమంలో స్నానం చేయటం వల్ల యజ్ఞయాగాలు దానాలు చేసిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితం లభిస్తుంది గంగాజలం కొద్ది పరిమాణంలో అయినా సరే మన శరీరానికి తగిలితే అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మనిషి ఎముకలు ఎన్ని సంవత్సరాలు గంగానదిలో ఉంటుందో అన్ని సంవత్సరాలు అతను స్వర్గంలో నివసించి పుణ్యం పొందుతాడు గంగా నది స్నానం చేసిన వ్యక్తితో పాటు అతడి ఏడు తరాలు పెద్దలు కూడా పుణ్య ఫలితాలు పొందుతారు. గంగా జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటే 100 చాంద్రయణ వ్రతాలు చేసిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది గరుత్మంతుని చూసి పాములు పారిపోయినట్లు గంగా మృత్రిక (మట్టి) రాసుకుని స్నానం చేసిన వ్యక్తి దేహం నుంచి పాపాలు దూరమవుతాయి గంగానది మహిమల్ని తలుచుకునే వారికి భయాల నుంచి విముక్తి కలుగుతుంది గంగా నది అవతరణ కథను రాసిన వారికి విన్నవారికి అన్ని వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది మనము ఏ నదిలో స్నానం చేసినా గంగా. గంగా. గంగా అని మూడుసార్లు అనుకుంటే గంగానదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది.

Also Read:  వివిధ రాష్ట్రాల్లో మహిళలు ధరించే గాజుల వెనుక రీజన్ ఏమిటో తెలుసా..