చాణక్య నీతి: కష్టాన్ని, ఓటమిని అధిగమించాలంటే.. ఈ విషయాలు గుర్తించుకోండి! విజయం ఎప్పుడూ మీ సొంతమవుతుంది..

చాణక్య నీతి: కష్టాన్ని, ఓటమిని అధిగమించాలంటే.. ఈ విషయాలు గుర్తించుకోండి! విజయం ఎప్పుడూ మీ సొంతమవుతుంది..
Chankya Neeti

ఆచార్య చాణక్యుడు చెప్పే విధానాలు చదవడానికి కఠినంగా ఉంటాయి. కానీ అవి మన జీవితాన్ని మంచి మార్గం వైపుకు తీసుకెళ్లే మార్గదర్శకాలని..

Ravi Kiran

|

Aug 16, 2021 | 9:41 AM

ఆచార్య చాణక్యుడు చెప్పే విధానాలు చదవడానికి కఠినంగా ఉంటాయి. కానీ అవి మన జీవితాన్ని మంచి మార్గం వైపుకు తీసుకెళ్లే మార్గదర్శకాలని మర్చిపోకూడదు. జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని అంశాలను తప్పకుండా మనసులో ఉంచుకోవాలని.. ఎవరితోనూ చెప్పకూడదని చాణక్యుడు చెప్పేవారు. చాణక్యుడు చెప్పిన మాటల ప్రాముఖ్యతను మీ జీవితంలోకి తీసుకుంటే.. మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురైనా ఏ సవాల్‌కైనా మీ దగ్గర పరిష్కారం ఉంటుంది. ఒకవేళ మీరు మొదలుపెట్టిన పనిలో మళ్లీ, మళ్లీ ఫెయిల్ అవుతుంటే.? లక్ష్యాన్ని చేరుకునే దిశలో కష్టాన్ని ఎదుర్కుంటుంటే.? అప్పుడు ఏం చేయాలో.? చాణక్య నీతి ఏం చెబుతోందో.? ఇప్పుడు తెలుసుకుందాం..

”కష్టపడి పని చేసినప్పటికీ.. విజయాన్ని సాధించకపోతే.. ఎంచుకున్న వ్యూహాన్ని మార్చుకోండి. వెళ్లే మార్గాన్ని కాదు. ఎందుకంటే చెట్టు కూడా ఎల్లప్పుడూ ఆకులను మారుస్తుంది, మూలాన్ని కాదు” – ఆచార్య చాణక్య

మీరు మీ లక్ష్యాలను చేరుకునే దిశలో ఎల్లప్పుడూ చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాన్ని పాటించాలి. కొన్నిసార్లు మన లక్ష్యం పెద్దది కావచ్చు. ఆ సమయంలో దాన్ని చేరుకోవడానికి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. అలాంటి పరిస్థితిలో మనం కష్టమనిపించి వెనకడుగు వేయకూడదు.

ఉదాహరణకు ఓ వ్యక్తి విజయం సాధించడంలో చాలాసార్లు విఫలమైతే.. ఖచ్చితంగా నిరాశ చెందుతాడు. వెంటనే వెనకడుగు వేయాలని ఆలోచిస్తాడు. ఇదే పరిస్థితి మీకు కూడా వస్తే.. ముందుగా మీ వ్యూహాన్ని సమీక్షించండి. ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మొదటి ప్రయత్నంలో విఫలమైతే, ఆ ఓటమికి గల కారణాలు ఏంటో తెలుసుకోండి. తద్వారా మీ వ్యూహాన్ని మార్చుకోండి.

శరదృతువు వచ్చినప్పుడు చెట్టు దాని ఆకులను రాల్చుతుందని గుర్తుంచుకోండి. అది ఎప్పుడూ మూలాన్ని వదలదు. మీ లక్ష్యం చెట్టుకున్న బలమైన మూలంలాగ ఎల్లప్పుడూ దృఢంగా ఉండాలి. ఆకులు మాదిరిగా అవసరమైనప్పుడు మీ వ్యూహాలను మార్చుకోండి. మీ లక్ష్యాన్ని చేరువయ్యే మార్గంలో ఎదురవుతున్న ఎత్తుపల్లాల గురించి ఆలోచించకండి. పూర్తి అంకితభావంతో కష్టపడి పనిచేయండి. మీ లక్ష్యాన్ని చేరుకోండి.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

 ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!

ఎనిమిదో స్థానంలో సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియాకు సూపర్ విక్టరీ.. గెలిపించిన బెస్ట్ ఆల్‌రౌండర్!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu