AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Couples: హిందూ సంప్రదాయంలో ఈ ఐదు జంటల్లా నేటి భార్యభర్తలుంటారట.. ఈ జంటల్లో మీరున్నారా తెలుసుకోండి

Pancha-Devathalu: ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి మనస్తత్వం ఒకలా ఉండదు. వేర్వేరు కుటుంబాల నేపథ్యంలో వచ్చి వివాహ బంధంతో ఒకటయ్యే భార్యాభర్తల మనస్తత్వాలు కూడా భిన్నమైనవి. ఈ దంపతులు ఐదు విధాలుగా ఉంటారని శాస్త్రం చెబుతున్న మాట. హిందూ సంప్రదాయంలో ఈ ఐదు జంటల్లా నేటి భార్యాభర్తలు ఉంటారట.. ఆ ఐదు జంటలు ఎవరంటే..

Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 16, 2021 | 1:01 PM

Share
మొదటి జంట లక్ష్మీనారాయణులు.. విష్ణుమూర్తి వక్షస్థలం మీద భార్య లక్ష్మీదేవి ఉంటుంది. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి.. అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై..ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.

1 / 5
రెండవ జంట గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం.. తలనుంచి కాలిబొటన వ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు. రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం, కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త. బోళాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య ఇలాంటి జంటను గౌరీశంకరుల జంట అని అంటారు.

2 / 5
మూడవది బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు. నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని. ఇలా ఏ మాట మాట్లాడినా.. ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

3 / 5
నాల్గవది ఛాయా సూర్యులు.. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతుంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది. ఛాయ భర్త లోకోపకారం కోసం పాటుపడుతూ.. విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా ఛాయాదేవి భర్తను అనుసరిస్తూ  నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది. ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా, పట్టుదలతో ఉంటాడో.. ఏ ఇంట అతని భార్య నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంటని అంటారు.

4 / 5
ఐదవ జంట రోహిణీ చంద్రులు. చంద్రుడు ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు. ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడు. ఇక రోహిణీ ఎప్పుడు మండి పోతుంటుంది. ఇక రోహిణి కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది. ఏ జంట భర్త మెత్తగా ఉండి.. అందరికీ నచ్చే మెచ్చే వాడిగా ఆకర్షణీయుడై ఉండి..  భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంటను రోహిణీ చంద్రుల జంటగా పోలుస్తారు.

5 / 5