ఎనిమిదో స్థానంలో సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియాకు సూపర్ విక్టరీ.. గెలిపించిన బెస్ట్ ఆల్‌రౌండర్!
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు చాలాకాలం దూరమైనా సంగతి తెలిసిందే...
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు చాలాకాలం దూరమైనా సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకుని తిరిగి పునరాగమనం చేశాడు. ఫామ్ లేక సతమతమవుతున్నప్పటికీ పాండ్యా టీమిండియాకు కీ ప్లేయర్. ఈ విషయాన్ని ఎన్నోసార్లు రుజువు కూడా చేసుకున్నాడు. వన్డేలు, టీ20లు మాత్రమే టెస్టులలోనూ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. గతంలో టీమిండియాను గెలిపించడం పాండ్యా చేసిన ఓ సూపర్బ్ సెంచరీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 96 బంతుల్లో 108 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా ఇన్నింగ్స్ 171 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అది కూడా ఇదే రోజున జరిగింది.
2017వ సంవత్సరం ఆగస్టు 12-14 వరకు టీమిండియా, శ్రీలంక మధ్య ఈ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 487 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 119 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్(85), కెప్టెన్ విరాట్ కోహ్లీ(42) రాణించారు. కానీ ఎనిమిదవ స్థానంలో దిగిన హార్దిక్ పాండ్యా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు.
టీమ్ ఇండియా సూపర్ విక్టరీ…
శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్ 135 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ దినేష్ చండీమల్(48) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కుల్‌దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఫాలో-ఆన్ ఆడాల్సిన శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో ఇండియా ఇన్నింగ్స్, 171 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక తరపున డిక్వెల్లా 41, చండిమాల్ 36 ఏంజెలో మాథ్యూస్ 35 పరుగులు మాత్రమే చేయగలిగారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా, షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.
Also Read: జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!
చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!
సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ
హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..