Success Story: సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ

Success Story: మనిషిలో చూడాల్సింది మంచితనం, మానవత్వం అంటూ ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి. నిజానికి మనిషిని చూడగానే ఎదుటివారిని ఆకర్షించేది అందం. అందుకనే అందం పెంచుకోండి..

Success Story: సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ
Ias Arthi Dogra
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2021 | 12:09 PM

Success Story: మనిషిలో చూడాల్సింది మంచితనం, మానవత్వం అంటూ ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి. నిజానికి మనిషిని చూడగానే ఎదుటివారిని ఆకర్షించేది అందం. అందుకనే అందం పెంచుకోండి ఇలా అంటూ రకరకాల ప్రొడక్స్ మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఓ యువతి మరగుజ్జు.. అయినప్పటికీ ఆత్మన్యూనతకులోనై కుమిలిపోకుండా, అపారమైన ఆత్మవిస్వాసంతో తన అంగవైకల్యాన్ని జయించింది. కోట్లాదిమంది యువతలో పదుల సంఖ్యలో అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యపడే ఐఏఎస్ లో ఉత్తీర్ణురాలైంది. మనిషి ఎదగడానికి బాహ్య సౌందర్యం అవసరం లేదని.. సంకల్పబలంతో దేనినైనా సాధించవచ్చని నిరూపించి, ఎందరికో రోల్ మోడల్ గా నిలిచింది ఆరతి డోగ్రా ఐఏఎస్.

ఆర్తి డోగ్రా ఐఏఎస్.. ‘విగ్రహం చిన్నది కానీ కీర్తి గొప్పది’ అనే సామెతను అక్షరాలా నిజం చేసింది. కేవలం మూడు అడుగుల మూడు అంగుళాల పొడవు గల ఆర్తి డోగ్రా అనేకమందికి ఒక ఉదాహరణగా నిలిచింది. యుపిఎస్‌సి ఐఎఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి జ్ఞానం, ప్రతిభ మాత్రమే ఉపయోగపడుతుందని ఆర్తి రుజువుచేసింది. ఈరోజు ఆర్తి డోగ్రా పోరాట కథగురించి తెల్సుకుందాం..

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ లో ఆర్తి జన్మించారు. ఆర్తి తండ్రి రాజేంద్ర డోగ్రా ఇండియన్ ఆర్మీలో కల్నల్, తల్లి కుంకుమ్ డోగ్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. ఆర్తి పుట్టిన సమయంలో, వైద్యులు ఆమె శారీరక బలహీనత గురించి చెప్పారు. అందువల్ల ఆర్తి తల్లిదండ్రులు ఆమె అంగవైకల్యం గురించి ఆలోచించలేదు. తల్లిదండ్రులు ఆర్తి విద్య సౌకర్యాలపై పూర్తి దృష్టి పెట్టారు.

డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో ఆర్తి తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీరామ్ కళాశాల నుండి కామర్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆర్తి మళ్ళీ స్వస్థలం డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అప్పుడు ఆర్తి ఉత్తరాఖండ్ లోని మొదటి మహిళా IAS అధికారి మనీషా పవార్‌ని కలిశారు. అప్పుడు మనిషాను స్ఫూర్తిగా తీసుకున్న ఆర్తి ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నారు. పట్టుదలతో చదివి యుపిఎస్‌సి పరీక్షలకు రెడీ అయ్యారు. 2006 లో మొదటి ప్రయత్నంలోనే ఆర్తి IAS పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

Arti Dogra Ias - Most SPOTLIGHTED Ias Officer

రాజస్థాన్‌లోని బికనీర్‌లో కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆర్తి పరిశుభ్రత కోసం ‘బంకో బికానో’ ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారం కింద, బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేయవద్దని ఆమె జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, పక్కా మరుగుదొడ్లను కూడా గ్రామాల్లో నిర్మించారు,. ఆర్తి ఈ ప్రచారాన్ని 195 గ్రామ పంచాయితీలకు విజయవంతంగా నిర్వహించారు. ఇది మంచి రిజల్ట్ ఇవ్వడంతో తరువాత పొరుగు జిల్లాలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఆర్తి చేపట్టిన ప్రచారాన్ని ప్రశంసించారు.

Arti Dogra IAS Officer Biography - Husband, Height & All Info

ఆర్తి చిన్నది కాబట్టి ప్రజలు ఆమెపై వ్యాఖ్యానించేవారు, కానీ ప్రతికూల ప్రతిస్పందనతో ఆర్తి ఎప్పుడూ నిరాశ చెందలేదు. జోధ్‌పూర్ డిస్కమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణిగా ఆర్తి ఖ్యాతిగాంచారు. తన పొట్టితనాన్ని బట్టి ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోకుండా తాను కోరుకున్న విజయం సొంతం చేసుకున్నారు. ఈ ఆర్తి కథ చాలా మంది మహిళలకు స్ఫూర్తిదాయకం.

Also Read: Nettikanti Anjaneya: కుడికంటితో భక్తులను చూస్తూ కోరినకోర్కెలు నెరవేర్చే నేట్టికంటి ఆంజనేయస్వామి