IND vs ENG 2nd Test Day 3 Highlights: ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్.. 391 పరుగులకు ఆలౌట్..
India vs England 2nd Test Day 3 Highlights: లార్డ్స్‌లో జరుగుతోన్న రెండవ టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బ్యాటింగ్‌లో సత్తాచాటిన భారత్, ఇటు బౌలింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తోంది.
IND vs ENG 2nd Test: లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ 10 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసి.. భారత్‌పై 27 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రూట్ 180* పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. బెయిర్ స్టో 57, బర్న్స్ 49 చొప్పున అత్యధిక పరుగులు చేశారు. ఇక భారత్ బౌలర్లు సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ 3, షమి 2 వికెట్లు తీసుకున్నారు.
కాగా, లార్డ్స్ వేదికగా జరుగుతోన్న రెండవ టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శి్స్తూ వచ్చింది. బ్యాటింగ్‌లో సత్తాచాటిన భారత్, ఇటు బౌలింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, సిక్స్) మరో 2 పరుగులు మాత్రమే జోడించి ఔటయ్యాడు. మిగతా ప్లేయర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే జడేజా, పంత్ మాత్రం ఆకట్టుకోవడంతో భారత్ ఆ మాత్రం స్కోర్ చేసింది. 86 పరుగుల వ్యవధిలో టీమిండియా.. తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. కాగా, ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లు తీయగా, రాబిన్సన్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు, మొయిన్ అలీ ఓ వికెట్ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలోనే తడబడింది. సిరాజ్ దెబ్బకు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను సిరాజ్(2/34) దారుణంగా దెబ్బతీశాడు. అయితే.. బర్న్స్49 పరుగులు, రూట్ 48 నాటౌట్‌తో ఆదుకున్నారు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. మూడవ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ టీమ్.. నిలకడగా రాణిస్తూ జట్టు స్కోర్‌ను అమాంతం పెంచేసింది. మూడవ రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆలౌట్ అయిన ఇంగ్లండ్ టీమ్.. 391 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ కెప్టెన్ రూట్ 180* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టీమ్ భారత్‌పై 27 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అండర్సన్ లార్డ్స్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన సంగతి తెలిసిందే. గడిచిన 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా (39 ఏళ్ల 14 రోజులు) పేరుగాంచాడు. లార్డ్స్ టెస్టు తొలి రోజు రోహిత్ శర్మ, పుజారాలను పెవిలియన్ పంపిన అండర్సన్.. రెండో రోజు రహానే, ఇషాంత్ శర్మ, బుమ్రా వికెట్లను పడగొట్టాడు.