చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

గొప్ప పండితుడైన ఆచార్య చాణుక్యుడు.. తాను రచించిన నీతిశాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి అనేక విషయాలు తెలిపారు..

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!
Chanakya Niti
Follow us

|

Updated on: Aug 14, 2021 | 1:14 PM

గొప్ప పండితుడైన ఆచార్య చాణుక్యుడు.. తాను రచించిన నీతిశాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి అనేక విషయాలు తెలిపారు. ఎలాంటి పనులు చేస్తే మనిషి జీవితం సంతోషంగా ఉంటుంది. ఎలాంటి పనులు చేస్తే మనిషి కష్టనష్టాలు ఎదుర్కుంటాడనేవి తెలియజేశారు. యువతకు ఎంతో ముఖ్యమైన దశ యవ్వనం. ఈ దశలో యువత ఎప్పుడూ తమ లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయాలని ఆచార్య చాణక్య అంటున్నారు. ఒక వ్యక్తి యవ్వనంలో ఏది సంపాదిస్తాడో.. అది అతడికి వృద్దాప్యంలో మద్దతుగా మారుతుంది.

అందువల్ల యుక్తవయస్సులోనే ప్రతీ వ్యక్తి తన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. సరైన వ్యూహాన్ని రూపొందించుకుని తమ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇలాంటి తరుణంలో కొన్ని అలవాట్లు యువత జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆచార్య చాణక్య అలాంటి మూడు అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి ఈ అలవాట్లను సకాలంలో దూరం చేసుకుంటేనే, అతను తన భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవచ్చునని అన్నారు. అవేంటో చూద్దాం..

సోమరితనం..

సోమరితనం యువతకు మాత్రమే కాదు ప్రతీ వ్యక్తికి శత్రువే. ఇది మీ సమయాన్ని వృధా చేసేలా చేస్తుంది. యవ్వన సమయంలో బద్దకానికి ఎలాంటి చోటు ఉండకూడదని ఆచార్య చాణక్య విశ్వసించారు. యువత ఎల్లప్పుడూ క్రమశిక్షణతో జీవితాన్ని గడపాలనేవారు. సరైన సమయానికి పడుకోవడం.. తెల్లవారుజామునే మేల్కోవడం వంటివి యువత పాటిస్తే.. ఎప్పుడూ మంచి ఫలితాలు చూడవచ్చునని అన్నారు.

మత్తు పదార్ధాలు..

మాదకద్రవ్య వ్యసనం కూడా యువతకు శాపంలా మారుతుంది. మత్తు పదార్ధాలు సేవించడం వల్ల ఓ వ్యక్తి అటు ఆర్ధికంగానే కాదు.. ఇటు ఆర్ధికంగా, మానసికంగానూ బలహీనపడతాడు. చెడు అలవాట్లు, చెడు సావాసాలకు దారి తీస్తుంది. ఎంతటి తెలివైనవాడైనా.. మత్తు బానిస అయితే.. తన వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది.

తప్పుడు వ్యక్తులతో స్నేహం..

చాణక్య నీతి ప్రకారం.. ఓ వ్యక్తి చేసే పనులపై తన స్నేహితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. తప్పుడు వ్యక్తులతో సావాసాలు చెడు అలవాట్లకు దారి తీస్తాయి. తప్పుడు వ్యక్తులు మిమ్మల్ని మీ లక్ష్యాల నుంచి దూరం చేస్తారు. కాబట్టి ఎప్పుడూ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!