AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 4 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిన రాజస్థాన్ ప్లేయర్.. అతడెవరంటే?

'ది హండ్రెడ్' టోర్నమెంట్ ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచుతోంది. బ్యాట్స్‌మెన్ల ఊచకోతతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..

31 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 4 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిన రాజస్థాన్ ప్లేయర్.. అతడెవరంటే?
Rajasthan Player
Ravi Kiran
|

Updated on: Aug 14, 2021 | 1:14 PM

Share

‘ది హండ్రెడ్’ టోర్నమెంట్ ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచుతోంది. బ్యాట్స్‌మెన్ల ఊచకోతతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు అలాంటి ఓ అద్భుత ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. తాజాగా ఈ టోర్నీలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ 31 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. టీ20 టాప్ బౌలర్ రషీద్‌ ఖాన్‌తో సహా మరో నలుగురు వరల్డ్ క్లాస్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతడెవరో కాదు లియామ్ లివింగ్‌స్టోన్.

28 ఏళ్ల లివింగ్‌స్టోన్ ది హండ్రెడ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరపున ఆడుతున్నాడు. ఇతడు 2021 ఐపీఎల్‌కు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాల్సి ఉండగా.. పర్సనల్ రీజన్స్ కారణంగా లీగ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన టీ20లో 103 పరుగులు సాధించాడు. ది హండ్రెడ్‌లో సదరన్ బ్రేవ్‌పై 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తాజాగా ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిన్న సైజు విధ్వంసం సృష్టించాడు.

లివింగ్‌స్టోన్ 31 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్..

100 బంతుల టోర్నమెంట్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ మొదట బ్యాటింగ్ చేసి 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెప్టెన్ లివింగ్‌స్టన్ అర్ధ సెంచరీ సాధించాడు. మరో బ్యాట్స్‌మన్ మైల్స్ హమ్మండ్ 20 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లివింగ్‌స్టోన్ 31 బంతుల్లో 50 పరుగులు చేశాడు, అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. అంటే, కేవలం 7 బంతుల్లో 34 పరుగులు చేశాడు.

రషీద్ ఖాన్ సహా 5 ప్రపంచ స్థాయి బౌలర్లు విఫలమయ్యారు

ఈ మ్యాచ్‌లో, ట్రెంట్ రాకెట్స్ బౌలర్లు రషీద్ ఖాన్, సమిత్ పటేల్‌తో సహా 5 మంది బౌలర్లు లివింగ్ స్టోన్‌ను ఆపడంలో విఫలమయ్యారు. అయితే ట్రెంట్ రాకెట్స్ 167 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ఫీనిక్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!