AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR Cricket: టెస్ట్‌ క్రికెట్‌లో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉంటుంది.. ఇంగ్లండ్‌ మ్యాచ్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్‌.

KTR About Test Cricket: భారత్‌లో క్రికెట్‌ను అభిమానించని వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇండియన్స్‌ క్రికెట్‌ను అంతలా ఓన్‌ చేసుకుంటారు. దీనికి..

KTR Cricket: టెస్ట్‌ క్రికెట్‌లో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉంటుంది.. ఇంగ్లండ్‌ మ్యాచ్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్‌.
Ktr Tweet Cricket
Narender Vaitla
|

Updated on: Aug 14, 2021 | 9:05 AM

Share

KTR About Test Cricket: భారత్‌లో క్రికెట్‌ను అభిమానించని వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇండియన్స్‌ క్రికెట్‌ను అంతలా ఓన్‌ చేసుకుంటారు. దీనికి సామాన్యులను సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. తమ వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో ఎంత బిజీగా ఉన్నా క్రికెట్‌కు సమయం కేటాయిస్తుంటారు. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే వారు కూడా క్రికెట్‌ను ఫాలో అవుతుంటారు. ఈ జాబితాలో తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ముందు వరుసలో ఉంటారు. క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే కేటీఆర్‌ అప్పుడప్పుడు మ్యాచ్ ఫలితాలపై సోషల్‌ మీడియా వేదికపై స్పందిస్తుంటారు. తాజాగా ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌పై కూడా కేటీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘టెస్ట్‌ క్రికెట్‌ ఫార్మట్‌లో ఏదో తెలియని మాయ ఉంది. ఈ మ్యాచ్‌ల్లో ఉండే మజానే వేరు. బాల్‌ బాగా స్వింగ్‌ అయ్యే మైదానాల్లో టెస్ట్‌ క్రికెట్‌ ఆడితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇంగ్లాండ్‌ బౌలర్‌ అండర్సన్‌ స్వింగ్‌ బౌలింగ్‌ను కోహ్లీ ఎదుర్కొన్న తీరు అద్భుతం. రోహిత్‌ శర్మ కూడా ఈ మ్యాచ్‌ అద్భుత ఆటతీరును ప్రదర్శకించారు’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

కేటీఆర్ చేసిన ట్వీట్..

Also Read: Cactus Juice: శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే కాక్టస్ జ్యూస్ రెసిపీ.. దీనిని తాగడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా

Megha Akash: ఆ విషయంలో అమ్మ, నాన్నల సలహాలు అస్సులు తీసుకోను నా ఇష్టమే ఫైనల్‌.. మేఘా ఆకాష్‌ .

AP Crime: శ్రీకాకుళం తీరంలో విషాదం.. పడవ బోల్తా.. ముగ్గురు మత్స్యకారుల గల్లంతు.. ఒకరు మృతి

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ