AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megha Akash: ఆ విషయంలో అమ్మ, నాన్నల సలహాలు అస్సలు తీసుకోను నా ఇష్టమే ఫైనల్‌.. మేఘా ఆకాష్‌ .

Megha Akash: పేరుకు తమిళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే అయినా తెలుగు సినిమా ద్వారా చిత్ర సీమకు పరిచయమైంది అందాల తార మేఘా ఆకాష్‌. తొలి చిత్రం నితిన్‌ హీరోగా నటించిన 'లై'లో నటించి..

Megha Akash: ఆ విషయంలో అమ్మ, నాన్నల సలహాలు అస్సలు తీసుకోను నా ఇష్టమే ఫైనల్‌.. మేఘా ఆకాష్‌ .
Megha Akash
Narender Vaitla
|

Updated on: Aug 14, 2021 | 10:09 AM

Share

Megha Akash: పేరుకు తమిళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే అయినా తెలుగు సినిమా ద్వారా చిత్ర సీమకు పరిచయమైంది అందాల తార మేఘా ఆకాష్‌. తొలి చిత్రం నితిన్‌ హీరోగా నటించిన ‘లై’లో నటించి మెప్పించిందీ బ్యూటీ. అనంతరం ‘ఛల్‌ మోహనరంగ’తో మరోసారి నితిన్‌తో జతకట్టిన ఈ చిన్నది మూడో చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పేరెంట్స్‌ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారైనప్పటికీ వారి ప్రభావం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ‘ఛల్‌ మోహనరంగ’ సినిమా తర్వాత మేఘా.. మళ్లీ తెలుగులో పెద్దగా కనిపించలేదని చెప్పాలి. అయితే మళ్లీ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందకు రానుంది.

‘రాజరాజ చోర’ అనే సినిమాతో మేఘా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పరిచయమైంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే మేఘా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ఇన్నేళ్లు గ్యాప్‌ రావడానికి గల కారణాన్ని వివరిస్తూ.. మంచి కథ దొరకకపోవడం వల్లే గ్యాప్‌ తీసుకున్నానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక తమిళంలో భిన్నమైన కాన్సెప్ట్‌తో కథలు రావడం వల్లే అక్కడ వరుస సినిమాలు చేశానని తెలిపింది. ఇక రాజరాజ చోర సినిమా గురించి చెబుతూ.. తాను ఇందులో సంజన అనే పాత్రలో కనిపిస్తున్నానని, ఇది అందంతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని తెలిపింది. ఇక సినిమాల ఎంపిక విషయంలో తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకుంటానని తెలిపిన మేఘా.. ఇందులో తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు తీసుకోను అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తెలుగులో దాదాపు నాలుగేళ్లు గ్యాప్‌ ఇచ్చిన మేఘా.. ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేసేందుకుగాను వరుస సినిమాలకు ఓకే చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ‘డియర్‌ మేఘ’ ‘గుర్తుందా శీతాకాలం’ ‘మనుచరిత్ర’ వంటి సినిమాల్లో నటిస్తోంది.

Also Read: Supritha: షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు.. వైరల్ అవుతున్న వీడియో..

Allu Arjun’s Pushpa: పులిలా రికార్డులను వేటాడుతున్న పుష్పరాజ్.. ఫస్ట్ సాంగ్‌‌‌‌తోనే షురూ చేశాడు..

Koratala NTR Movie: ఎన్టీఆర్‌, కొరటాల చిత్రానికి అనిరుధ్‌ అంత తీసుకోనున్నాడా.? సంచలనంగా మారిన నయా రూమర్‌.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్