AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cactus Juice: శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే కాక్టస్ జ్యూస్ రెసిపీ.. దీనిని తాగడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా

Cactus Juice: ఎడారి మొక్క కాక్టస్ ను కొంతమంది పంట పొలాల చుట్టూ కంచెగా పెంచుతారు. కొన్ని కాక్టస్ మొక్కలు ఆర్థిక వనరుగా మారాయి. బ్రహ్మజెముడు, నాగజెముడు పండ్లు ఇస్తాయి. పిటాయ జాతి మొక్కలు డ్రాగన్ వంటి పండ్లు..

Cactus Juice: శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే కాక్టస్ జ్యూస్ రెసిపీ.. దీనిని తాగడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా
Cactus Juice
Surya Kala
|

Updated on: Aug 14, 2021 | 8:44 AM

Share

Cactus Juice: ఎడారి మొక్క కాక్టస్ ను కొంతమంది పంట పొలాల చుట్టూ కంచెగా పెంచుతారు. కొన్ని కాక్టస్ మొక్కలు ఆర్థిక వనరుగా మారాయి. బ్రహ్మజెముడు, నాగజెముడు పండ్లు ఇస్తాయి. పిటాయ జాతి మొక్కలు డ్రాగన్ వంటి పండ్లు ఇస్తాయి. వీటిని తినవచ్చు. అయితే కాక్టస్ లోని చపాతీ అనే ఒక రకం కాక్టస్ రసం ఆరోగ్యానికి చాలా మంచిది. చపాతీ కాక్టస్ మొక్క వివిధ పోషక ప్రయోజనాలను కలిగి ఉందని శాస్త్రవేత్తలు మరియు పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు ఈ చపాతీ కాక్టస్ జ్యూస్ తయారీ.. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

చపాతీ కాక్టస్ జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ కాక్టస్ లో విటమిన్ సి, విటమిన్ బి, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం , మెగ్నీషియం , బీటా కారోటీన్ , అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఈ కాక్టస్ రసం పలు షాప్స్ లో దొరుకుతుంది. అయితే చాలా ఖరీదైన జ్యూస్ ని చెప్పవచ్చు.. కనుక ఈ జ్యూస్ ని ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు..

చపాతీ కాక్టస్ జ్యూస్ రెసిపీ:

ముందుగా చపాతీ కాక్టస్ ముళ్ళని మెల్లగా రిమూవ్ చేయండి.. తర్వాత ఒక కుండ తీసుకుని నీరు పోసి.. ఆ నీటిని బాగా మరిగించండి. అప్పుడు ఆ నీటిలో చపాతీ కాక్టస్ వేయాలి. అనంతరం ఒక ఐదు నిమిషాలపాటు ఉడకబెట్టండి. తర్వాత చపాతీ కాక్టస్ ను నీటిలోంచి తీసి చల్లబరచండి. అనంతరం కాక్టస్ స్కిన్ ని తీసి.. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఆ ముక్కల్లో కొంచెం నిమ్మ, ఆరెంజ్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు కలిపి మిక్సీ వేసుకోవాలి. తర్వాత వడకడితే అంతే జ్యూస్ రెడీ. పండ్లు వేసుకోవడం వలన ఈ జ్యూస్ కి మంచి టెస్ట్ వస్తుంది.

జ్యూస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

*చపాతీ కాక్టస్ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గించడంలో మంచి సహాయకారి. ఒక కప్పు చపాతీ కాక్టస్ రసంలో 15 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని తాగడం వల్ల మీ శరీరానికి తగినంత పోషకాలు లభిస్తాయి. *చపాతీ కాక్టస్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఎల్‌డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. దీంతో గుండె జబ్బులు, అథెరోస్క్లెరోసిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. *జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వాపు, ఉబ్బరం, మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , పెద్దప్రేగు శోథ వంటి జీర్ణ సమస్యలకు శతాబ్దాలుగా చపాతీ కాక్టస్ రసం సిఫార్సు చేయబడింది.

ముఖ్య గమనిక:

అయితే ఈ క్యాక్టస్ జ్యూస్ తాగడం వల్ల కొంతమందిలో వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అయితే అందరికీ ఇలాంటి సమస్యలు రావు. శరీరం తీరుని బట్టి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ముందుగా ఆరోగ్యనిపుణులు సలహా తీసుకుని తాగితే మంచిది.

Also Read: మనచుట్టూ పెరిగే ఈ చిన్న మొక్క ఔషధాల గని.. అనేక అనారోగ్య సమస్యల నివారణకు దివ్య ఔషధం