Drumstick Leaves Soup: రోగనిరోధక శక్తిని పెంచే మునగాకు సూప్ తయారీ విధానం ఎలా అంటే..

Drumstick Leaves Soup: మునక్కాయలే కాదు మునగాకులో కూడా ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ఉంటాయి. పల్లెల్లో మునగాకుని కూర‌గా చేసుకుని తింటారు. ఈ మునగాకు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కొలస్ట్రాల్ షుగర్ ను..

Drumstick Leaves Soup: రోగనిరోధక శక్తిని పెంచే మునగాకు సూప్ తయారీ విధానం ఎలా అంటే..
Drumstick Leaves Soup
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2021 | 9:54 AM

Drumstick Leaves Soup: మునక్కాయలే కాదు మునగాకులో కూడా ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ఉంటాయి. పల్లెల్లో మునగాకుని కూర‌గా చేసుకుని తింటారు. ఈ మునగాకు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కొలస్ట్రాల్ షుగర్ ను తగ్గుతాయి. జీర్ణ సమస్యలు ఉండవు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో కొంతమంది నీటిలో ఆకులను మరిగించి తాగుతారు.. అలా మునగాకు నీరు తాగలేని వారు సూప్ చేసుకుని తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇది రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, పోష‌కాల‌ను కూడా అందిస్తుంది. పెద్దలకే కాదు.. చిన్న పిల్లలకు కూడా ఈ మునగాకు సూప్ మంచిది. మ‌రి మున‌గ ఆకుల‌తో సూప్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..

కావ‌ల్సిన ప‌దార్థాలు:

మున‌గ ఆకులు – ఒక‌టిన్న‌ర క‌ప్పు చిన్న ఉల్లిపాయ‌లు – 6 ట‌మాటా – 1 జీల‌క‌ర్ర – అర టీస్పూన్ వెల్లుల్లిరేకలు – 5 నీళ్లు – 2 క‌ప్పులు ఉప్పు – రుచికి స‌రిప‌డా నూనె – 1 టీ స్పూన్

త‌యారీ విధానం:

మున‌గాకులను శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టాలి. తర్వాత స్టౌ పై బాండి పెట్టుకుని నూనె వేసి.. వేడి చేయాలి.. నూనె వేడెక్కాక జీల‌కర్ర వేసి కొద్దిగా వేయించాలి. అందులో వెల్లుల్లి రెబ్బ‌ల‌ను బాగా న‌లిపి వేసుకోవాలి. త‌రువాత కొంత సేపు వేయించి అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ‌లు, ఉప్పు వేసుకుని వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చిన్నగా తరిగిన టమాటా ముక్కలను వేయాలి. టమాటా బాగా వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న మునగాకులను వేసుకుని కొంత సేపు వేయించుకోవాలి. కమ్మగా వేగిన తర్వాత అందులో నీరు పోసుకోవాలి. 10 నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. ఉప్పు చూసుకుని అవసరం అయితే మరికొంచెం ఉప్పు వేసుకోవాలి. దింపే ముందు కొంచెం మిరియాల పొడి చల్లుకుని స్టౌ మీద నుంచి దింపేస్తే.. మునగాకు సూప్ రెడీ.. వేడి వేడిగా తాగితే.. రుచి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

Also Read:  పుస్తకాల భాండాగారం ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రెరీ, అతి ప్రాచీన గంథాలయం ఎక్కడ ఉందో తెలుసా

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే