AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Side Effects: గరం గరం చాయ్‌ని తెగ లాగించేస్తున్నారా..? అయితే ఈ సమ్యసలను కొని తెచ్చుకున్నట్లే.

Tea Side Effects: కాస్త తల నొప్పిగా ఉంటే చాలు వెంటనే... 'అబ్బా తల బద్దలవుతోంది ఒక కప్పు టీ తాగాల్సిందే' అని అంటుంటాం. ఇక టిఫీన్‌ చేయగానో ఓసారి, లంచ్‌కు ముందు మరోసారి మళ్లీ సాయంత్రం...

Tea Side Effects: గరం గరం చాయ్‌ని తెగ లాగించేస్తున్నారా..? అయితే ఈ సమ్యసలను కొని తెచ్చుకున్నట్లే.
Drinking Tea
Narender Vaitla
|

Updated on: Aug 14, 2021 | 12:03 PM

Share

Tea Side Effects: కాస్త తల నొప్పిగా ఉంటే చాలు వెంటనే… ‘అబ్బా తల బద్దలవుతోంది ఒక కప్పు టీ తాగాల్సిందే’ అని అంటుంటాం. ఇక టిఫీన్‌ చేయగానో ఓసారి, లంచ్‌కు ముందు మరోసారి మళ్లీ సాయంత్రం స్నాక్స్‌ తిన్న తర్వాత మరోసారి, చలి ఎక్కువగా ఉంటే రాత్రి ఇంకోసారి ఇలా కప్పు మీద కప్పు వేస్తూ చాయ్‌ ప్రేమికులు లొట్టలేసుకుంటూ తాగేస్తుంటారు. బ్రిటీషర్లు పోతూ పోతూ మనకు అలవాటు చేసిన ఈ చాయ్‌ మన జీవితంలో ఓ భాగమైపోయింది. మరి మనం ఎంతో ఇష్టపడి తాగే ఈ చాయ్‌ వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయనే విషయం మీకు తెలుసా? లొట్టలేసుకొని తాగే చాయ్‌తో కలిగే ఆ నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం..

* చాయ్‌ తయారీ కోసం ఉపయోగించే టీ పౌడర్‌లో నికోటిన్‌, కెఫిన్‌ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్‌ ఉత్పత్తికి కారణంగా మారుతాయి. రోజులో అధిక మొత్తం చాయ్‌ తాగితే గ్యాస్‌, అసిడిటీ సమస్యలు మొదలవుతాయి. చాయ్‌ జీర్ణ క్రియ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. చాయ్‌ తాగిన తర్వాత ఆకలివేయకపోవడానికి కారణం ఇదే. ఖాళీ కడపుతో టీ తాగితే వికారంగా అనిపిస్తుంది. కడుపంతా డిస్ట్రబ్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

* చాయ్‌ తాగగానే ఒక్క సారిగా శరీరానికి శక్తి అందిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఎంత ఫాస్ట్‌గా శక్తి వస్తుందో అంతే వేగంగా వెళ్లిపోతుంది. హార్డ్‌ వర్క్‌ చేసే వారు క్రమం తప్పకుండా చాయ్‌ తాగుతూనే ఉంటారు. ఇది రాత్రి నిద్రపై ప్రభావం చూపుతుంది. సరైన నిద్ర లేకపోతే శరీరంలో అలసట పెరుగుతుంది. అలాగే కోపం, చికాకు, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు సైతం తలెత్తుతాయి.

* ఇటీవల చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. 30 ఏళ్ల లోపు వారు కూడా కీళ్ల నొప్పులు అంటూ బోరుమంటున్నారు. అయితే చాయ్ ఎక్కువగా తాగడం ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా.? టీ పౌడర్‌లో ఉండే కొన్ని పదార్థాలు ఎముకలను బలహీనపరుస్తాయి.

* చాలా మంది చాయ్‌ని వేడి వేడిగా తాగడానికే ఆసక్తి చూపిస్తుంటారు. అయితే దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎక్కువ వేడీగా ఉండే టీని తాగడం వల్ల కడుపులోని ఉపరితలం దెబ్బతింటుంది. కాల క్రమేణా ఇది గాయంగా మారడానికి దారి తీస్తుంది. అంతేకాకుండా వేడి వేడీ టీని తాగడం వల్ల భవిష్యత్తులో గొంతు క్యాన్సర్‌కి కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* మనలో కొంత మంది ఆకలిగా ఉన్నప్పుడు టీ తాగుతుంటారు. దీనివల్ల ఆకలి వెంటనే తగ్గిపోతుంది. అయితే ఖాళీ కడపుతో టీ తాగితే హృదయ స్పందన రేటులో మార్పు చోటు చేసుకుంటుందని మీకు తెలుసా? దీనికి కారణంగా టీ పౌడర్‌లో ఉండే కెఫిన్‌ శరీరంలో చాలా వేగంగా కరిగిపోతుంది. దీంతో రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది హృదయంపై ప్రభావం చూపుతుంది. కాలక్రమేణా హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

Also Read: Viral Photo: రోడ్డు మధ్యలో రెండు కుక్కల కౌగిలింత.. కన్నీళ్లు పెట్టుకుంటున్న సోషల్ మీడియా..

Netflix: ఢిల్లీ హైకోర్టులో నెట్‌ఫ్లిక్స్‌కు చుక్కెదురు.. బాలుడి మర్డర్ డాక్యుమెంటరీ ప్రసారానికి బ్రేక్..

Lovers Death: కారులోనే అగ్నికి ఆహుతైన ప్రేమజంట.. అసలేమైందంటే..?