Omega-3: గుండె పనితీరును మెరుగుపరిచే ఒమేగా త్రీ.. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే ఇవి తీసుకోండి..!

Omega -3: ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే తీసుకునే ఆహారం, ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల వివిధ రకాల ..

Omega-3: గుండె పనితీరును మెరుగుపరిచే ఒమేగా త్రీ.. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే ఇవి తీసుకోండి..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 8:24 PM

Omega -3: ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే తీసుకునే ఆహారం, ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల వివిధ రకాల వ్యాధులు దరిచేరుతున్నాయి. ఇక గత ఏడాదిగా ఇబ్బందులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే మనం కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఒమేగా-3 ఉండే ఆహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడమే కాకుండా వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లం మంచి కేలరీలను అందిస్తుంది. చేపల్లో ఉండే ఈ ఒమెగా 3 గుండె పనితీరు మెరుగు పరుస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మన శరీరంలో ఉత్పత్తి చేసే అనేక రకాల కొవ్వులు ఉన్నాయి. ఒమేగా-3 ముఖ్యమైనదిగా చెప్పాలి. మన శరీరం సరిగ్గా పని చేసే తీరుకు చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఒమేగా-3 తీసుకోవడమే. ఒమేగా తీసుకోవడం వల్ల మన గుండె, చర్మం, మెదడు ఆరోగ్యం బాగా ఉంటుంది. అందుకే ఒమేగా త్రీ ఉన్న ఆహారం మీ ప్రతి రోజు భోజనం లో భాగం చేసుకుంటే ఎంతో మంచిదంటున్నారు వైద్యనిపులు.

చేపలు :

చేపల్లో కూడా ఒమేగా-3 అధిక శాతం ఉంది. చేపలు తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. చేపల్లో ఒమేగా అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా మెగ్నీషియం అధిక సంఖ్యలో ఉంటుంది. ఇవి కండరాల పునరుత్పత్తికి, రోగ నిరోధక శక్తి పెంపొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి.

అవిసె గింజలు, చియా విత్తనాలు :

అవిసె గింజలు, చియా విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంంటాయి. ఈ విత్తనాలలో ఇనుము, మెగ్నీషియం, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇవి అధిక కొలెస్ట్రాల్‌తో పోరాడానికి ఉపయోగపడుతుంది.

వాల్‌నట్స్‌ :

వాల్‌నట్స్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లలు అధిక సంఖ్యలో ఉంటాయి. గుండె పనితీరులో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్‌ స్థాయిలను మెరుగు పరుస్తాయి.

బ్లూబెర్రీస్‌:

బ్లూబెర్రీస్‌లో కేలరీలు అధిక సంఖ్యలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండె జబ్బులకు, రక్తపోటు నుంచి కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒమేగా-3 సప్లిమెంట్స్‌ ఉంటాయి.

ఇవీ కూడా చదవండిDiabetes Symptoms: మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే డయాబెటిస్‌ను ఇలా ముందుగానే గుర్తించవచ్చు..!

Tea Side Effects: గరం గరం చాయ్‌ని తెగ లాగించేస్తున్నారా..? అయితే ఈ సమ్యసలను కొని తెచ్చుకున్నట్లే.

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..