Diabetes Symptoms: మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే డయాబెటిస్‌ను ఇలా ముందుగానే గుర్తించవచ్చు..!
Diabetes Symptoms: ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడేవారు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇందుకు కారణాలు అనేక ఉన్నా.. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్కసారి మనలో..
Diabetes Symptoms: ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడేవారు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇందుకు కారణాలు అనేక ఉన్నా.. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్కసారి మనలో ఈ వ్యాధి బారిన పడ్డారంటే నిర్మూలించడం సాధ్యం కాదు. ఆహార నియమాలు, ఇతర జాగ్రత్తలు తీసుకుంటే అదుపులో పెట్టుకోవాలి తప్ప.. శాశ్వతంగా తొలగించడం సాధ్యం కాదు. ఈ వ్యాధిన బారిన పడిన వారు జీవనశైలిలో మార్పులు అయితే, కొన్ని లక్షణాలను గుర్తించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లు ముందుగానే గుర్తించవచ్చు.
డయాబెటిస్ అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మనలో కనిపించడం మొదలుకాగానే అనేక భాగాలను దెబ్బతినడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ కారణంగా కళ్ళు బలహీనంగా మారవచ్చు. మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. ఇదే సమయంలో చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు.
మన శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌తో పాటు పొడి చర్మం సమస్య ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి నిర్ధారణకు ముందే మన చర్మంపై కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను సూచిస్తాయి. ఇటువంటి లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే డయాబెటిస్‌ను నివారించుకోవచ్చు.
గొంతు లేదా చంకల్లో నల్లటి ప్యాచెస్:
గొంతు లేదా చంకల్లో నల్లటి ప్యాచెస్ ఏర్పడుతాయి. వీటిని చేతితో తాకినప్పుడు వెల్వెట్ మాదిరిగా అనిపిస్తాయి. ఇవి మధుమేహం రావడానికి ముందు లక్షణాలని గుర్తించాలి. ఈ లక్షణం కనిపించింది అంటే మీ రక్తంలో ఇన్సులిన్ పెరిగినట్లు సంకేతాలే.
చర్మంపై మచ్చలు:
చర్మంపై దురద లేదా నొప్పి లేదా చర్మంపై పెరిగిన మొటిమలు ఏర్పడతాయి. తర్వాత మొల్లమెల్లగా పసుపు, ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి కూడా మధుమేహానికి ముందస్తు లక్షణాలేనని గుర్తించాలి. దీని కోసం షుగర్ చెక్ చేసుకోవడం ఎంతో అవసరం. ఇలా గుర్తించిన వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు కూడా తీసుకోవాలి.
నయంకాని గాయాలు:
ఒక వ్యక్తి రక్తంలో చక్కెరల స్థాయి చాలా కాలం పాటు ఎక్కువగా ఉన్నట్లయితే.. నరాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రక్త ప్రసరణలో సమస్యలు కూడా వస్తాయి. నరాలు దెబ్బతినడం వల్ల చర్మంపై ఏదైనా గాయమైతే త్వరగా నయం కాదు. ఇలాంటి సమస్య కనిపించగానే వెంటనే వైద్యున్ని సంప్రదించడం బెటర్.