Vegetables Cleaning: కూరగాయలను సబ్బుతో శుభ్రం చేస్తున్నారా..? అయితే ప్రమాదమే.. మరి ఎలా క్లీన్‌ చేయాలి..?

Vegetables Cleaning: కరోనా వైరస్‌ రావడంతో ప్రతి ఒక్కరికీ చేతులు, కాళ్లను సబ్బు, ఇతర క్రీములతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు వంటింటికి కూడా..

Vegetables Cleaning: కూరగాయలను సబ్బుతో శుభ్రం చేస్తున్నారా..? అయితే ప్రమాదమే.. మరి ఎలా క్లీన్‌ చేయాలి..?
Vegetables Cleaning
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2021 | 10:02 PM

Vegetables Cleaning: కరోనా వైరస్‌ రావడంతో ప్రతి ఒక్కరికీ చేతులు, కాళ్లను సబ్బు, ఇతర క్రీములతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు వంటింటికి కూడా చేరింది. అంటే, నిత్యం వంట కోసం తీసుకొచ్చే కూరగాయలతో పాటు పండ్లను కూడా చాలా మంది ఇతర లిక్విడ్‌లతో, సబ్బుతో శుభ్రం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వంటి వైరస్‌లు, ఇతర సూక్ష్మక్రిములను దూరం చేసుకునేందుకు చాలా మంది రకరకాలుగా పండ్లు, కాయగూరలను శుభ్రం చేసుకుంటున్నారు. అయితే, పండ్లు, కూరగాయలను ఎలా శుభ్రం చేయాలి..? దేనితో శుభ్రం చేయాలి..? అనే అవగాహన చాలా మందిలో లేదు. ఫలితంగా ఆరోగ్యం ఏమోగానీ.. అనారోగ్యం తెచ్చుకుంటున్నారు.

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెబుతోంది..

వంటలు చేయడానికి ముందు తీసుకువచ్చే కూరగాయాలను శుభ్రం చేసుకుంటుంటాం. చాలా మంది ఇంట్లో వాడే సబ్బులతోనే వాటిని కూడా పరిశుభ్రం చేసుకుంటున్నారు. మరికొంతమంది సర్ఫ్‌లను కూడా వాడుతున్నారు. కూరగాయలు, పండ్లను సబ్బు, డిటర్జెంట్లు, సర్ఫ్‌, డెటాల్‌, శానిటైజర్లు, ఇతరాత్ర క్లీనింగ్ వస్తువులతో శుభ్రం చేయాలనేది కేవలం అపోహ మాత్రమేనని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వెల్లడించింది. ఇలా శుభ్రం చేయడం వల్ల వాటిని తిన్నప్పుడు మన పొట్టలోకి పోయి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎఫ్‌డీఏ హెచ్చరించింది.

అయితే కూరగాయలు, పండ్లను సబ్బు, డిటర్జెంట్లతో శుభ్రం చేసినప్పుడు వాటి తొక్కపై కొంత మిగిలిపోతుందని, వాటిని తిన్నప్పుడు మన పొట్టలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎఫ్‌డీఏ తెలిపింది. ఇలాంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రోఇంటెస్టైనల్‌ సమస్యలు, వాంతులు, విరేచనాలతోపాటు డయోరియాకు దారితీసే ప్రమాదం ఉందని సూచిస్తోంది.

మరి ఎలా శుభ్రం చేయాలి..?

మార్కెట్‌ నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను తెచ్చిన వెంటనే కుళాయి కింద పెట్టి మెల్లగా నీరు పోస్తూ కడగాలి. ఫలితంగా వీటిని పట్టుకుని ఉండే దుమ్ము, బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతాయి. కుళాయిలో నీరు మరీ ఫోర్స్‌గా కాకుండా నెమ్మదిగా వదులుతూ శుభ్రం చేయడం మంచిది. ఏవైనా పగిలి ఉన్నట్లయితే వాటిని తీసేయడం లేదా పగిలి ఉన్న భాగాన్ని తొలగించి వాడుకోవడం చేయడం బెటర్‌. బంగాళదుంప, చిలగడదుంప, క్యారట్‌, అల్లం వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు బ్రష్‌ లేదా స్పాంజ్‌ వాడటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. కూరగాయలను కడిగేప్పుడు పాత్రలో వేయకూడదు. బయట కుళాయిని వాడాలి. అలాగే, ఆకుకూరలను ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇలా చేస్తే పురుగులు బయటకు..

ఆకుకూరలను పెద్ద పాత్రలో వేసి నీరు, ఉప్పు వేసి కాసేపు ఉంచినట్లయితే పురుగులు ఉంటే బయటకు వస్తాయని, ఆకుకూరలను టవల్‌లో ఉంచి నీరు వెళ్లేలా చేయగలిగితే శుభ్రంగా ఉంటాయని చెబుతున్నారు. చివరగా, కూరగాయలు, పండ్లను శుభ్రం చేసే ముందు, చేసిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం మాత్రం మరిచిపోవద్దంటున్నారు.

చన్నీళ్లతో శుభ్రం చేస్తే..

పండ్లు, కూరగాయాలను చల్లటి నీటితో శుభ్రం చేయడం చాలా మంచిదని ఉత్తర కరోలినా స్టేట్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ బెన్‌ చాప్‌మ్యాన్‌ చెబుతున్నారు. చల్లటి నీటి కింద కూరగాయాలను శుభ్రం చేయడం వల్ల వివిధ రకాల రోగకారకాలు 90 నుంచి 99 శాతం వరకు తొలిగిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఇలా సబ్బుతో కానీ, ఇతర కెమికల్స్‌తో కానీ కూరగాయలు, పండ్లను కడగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Diabetes Symptoms: మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే డయాబెటిస్‌ను ఇలా ముందుగానే గుర్తించవచ్చు..!

Platelet Count: ప్లేట్‌లెట్స్‌ ఎందుకు తగ్గుతాయి.. ఒక వేళ తగ్గితే ప్రమాదం ఏమిటి.. వాటిని పెంచుకోవడం ఎలా.?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!