Platelet Count: ప్లేట్‌లెట్స్‌ ఎందుకు తగ్గుతాయి.. ఒక వేళ తగ్గితే ప్రమాదం ఏమిటి.. వాటిని పెంచుకోవడం ఎలా.?

Platelet Count: ప్రస్తుతం వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, మానసిక ఆందోళన, ఉద్యోగాల్లో టెన్షన్‌ తదితర కారణాల వల్ల మనిషి ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నాడు...

Platelet Count: ప్లేట్‌లెట్స్‌ ఎందుకు తగ్గుతాయి.. ఒక వేళ తగ్గితే ప్రమాదం ఏమిటి.. వాటిని పెంచుకోవడం ఎలా.?
Platelet Count
Follow us
Subhash Goud

|

Updated on: Aug 08, 2021 | 11:44 AM

Platelet Count: ప్రస్తుతం వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, మానసిక ఆందోళన, ఉద్యోగాల్లో టెన్షన్‌ తదితర కారణాల వల్ల మనిషి ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నాడు. ఇక డెంగీ జ్వరం వచ్చిందంటే చాలు అధికంగా ప్లేట్‌లెట్స్‌ క్షీణిస్తుంటాయి. ఆ సమయంలో ర‌క్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి ప‌డిపోతుంది. దీంతో ఆరోగ్యం మ‌రింత క్షీణించి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి జ్వరం వచ్చినప్పుడు వైద్యులు ఇచ్చే మందులతో పాటు కొన్ని రకాల పండ్లు, ఇతర ఆహార ప‌దార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.

ఎందుకు తగ్గుతాయి?

శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. ప్రస్తుత జనరేషన్‌లో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు రక్తం పలుచబడటానికి ఉపయోగించే మందుల వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ప్లేట్‌లెట్స్ మరీ తక్కువగా ఉన్నపుడు ఏ గాయం లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్ లెట్స్ సక్రమంగా తమ విధిని నిర్వహించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ ప్లేట్‌లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు అంటున్నారు.

ప్లేట్‌లెట్స్‌ ఎక్కువగా ఉంటే ఉపయోగం ఏమిటి..?

తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సీజన్ అందిస్తుంది. ఇక మిగిలినవి ప్లేట్ లెట్స్ శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతాయి. ఇవి అందరిలోనూ ఒకే విధంగా ఉండవు. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ కణం 7-10 రోజుల వరకు బతికి ఉంటుంది. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు ప్లేట్‌లెట్స్.

ప్లేట్‌లెట్స్‌ పెరగాలంటే..

ఆప్రికాట్‌ పండ్లను రోజు రెండు సార్లు తీసుకుంటే చాలు. రక్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి. ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవచ్చు. దీంతో వ్యాధి తగ్గుముకం పడుతుంది. బొప్పాయి పండ్లు డెంగీ వ్యాధికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దీని ద్వారా డెంగీ జ్వరం నుంచి బయటపడడమే కాకుండా వేగంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగిపోతాయి. దానిమ్మ పండ్లను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతాయి. ఇవి రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

అలాగే ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. దీంతో వాటిలో ఉండే విటమిన్‌ కె ప్లేట్‌లెట్ల సంఖ్య పెంచుతుంది. వెల్లుల్లి రేకులను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య సమృద్దిగా పెరుగుతుంది. బీట్‌ రూట్‌ జ్యూస్‌ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌ రక్తహీనతతో బాధపడేవారే కాకుండా డెంగీ వచ్చిన వారు కూడా తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. క్యారెట్‌ను తరచూ తింటున్నా రక్తం వృద్ది చెంది తద్వారా ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి. ఇలా డెంగీ జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్‌ పడిపోయినా, రక్తహీనతతో బాధపడుతున్న వారు ఈ పండ్లను తీసుకున్నట్లయితే వైద్యుడి వద్దకు వెళ్లకుండా ఇంట్లో ఉండే నయం చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

Female infertility: సంతానలేమి.. మహిళల్లో ఈ సమస్యలు ఉన్నట్లయితే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ..!

Diabetes Control: మధ్యాహ్న భోజనం సమయంలో ఈ ఐదు ఆహారాలు డైట్‌లో చేర్చుకుంటే షుగర్‌ నియంత్రణ..!

Breastfeeding: తల్లిపాలకు, ఇతర పాలకు తేడా ఏమిటి..?.. పరిశోధనలలో తేలిన విషయాలు..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!