Diabetes Control: మధ్యాహ్న భోజనం సమయంలో ఈ ఐదు ఆహారాలు డైట్‌లో చేర్చుకుంటే షుగర్ నియంత్రణ..!
Diabetes Control: ప్రస్తుతం మధుమేహం వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది..
Diabetes Control: ప్రస్తుతం మధుమేహం వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది. లేకపోతే షుగర్ లెవల్స్ పెరిగి మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ వచ్చిన వారు జీవనశైలిని మార్చుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు.
ఆకు కూరలు:
డయాబెటిస్ ఉన్నవారు మధ్యాహ్న భోజనం సమయంలో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతికూర, బతువా, బ్రోకలీ, గోరింటాకు, తోరాయి, చేదుకాయ వంటివి తినవచ్చు. వీటిలో తక్కువ కెలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చ కూరలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. గుండె, కంటికి ఎంతోగానో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో విటమిన్-సి ఉంటుంది. ఇది టైప్-2 డయాబెటిస్ రోగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెంచేలా చేస్తాయి.
తృణధాన్యాలు-పప్పులు:
మధుమేహం బారిన పడిన వారు రోజువారీ భోజనంలో ఎక్కువ పప్పులను చేర్చడం ఎంతో మంచిది. పప్పులు శరీరానికి ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి. ఇందులో పోటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు సమృద్దిగా ఉంటాయి. గోధుమ రొట్టే బదులుగా ధాన్యపు రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బార్లీ తీసుకోవడం మంచిది.
గుడ్డు:
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఆహారంలో గుడ్డును చేర్చడం మంచిది. ప్రతి రోజు ఒక గుడ్డు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అన్ని అమైనో ఆమ్లాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. రోజు గుడ్డు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ వారికి ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
పెరుగు :
మధ్యాహ్న భోజనం సమయంలో పెరుగును చేర్చడం ఎంతో మంచిది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా పెరుగుతో ఎంతో మంచిది. పెరుగులో కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా పెరుగు బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తి పెంచడంలో ఉపయోగపడుతుంది.
ఫ్యాటీ ఫిష్:
మీరు నాన్‌వేస్ తింటే మధ్యాహ్నం ఆహారంలో ఫ్యాటీ ఫిష్ చేర్చుకోవడం మంచిది. సార్టినెస్, హెర్రింగ్, సాల్మన్ చేపలను కూడా తినవచ్చు. మధుమేహంతో బాధపడుతున్నవారికి చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చేపలు ఎక్కువగా తినడం మంచిది.