Weight Loss : బరువు తగ్గడానికి ఈ 5 ఆహారాలు డైట్‌లో చేర్చండి..! తక్కువ రోజుల్లో మంచి ఫలితాలను చూస్తారు..
Weight Loss : ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుంటే రోజు మొత్తం హుషారుగా ఉండవచ్చు. నీరసం అనేది సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంది.
Weight Loss : ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుంటే రోజు మొత్తం హుషారుగా ఉండవచ్చు. నీరసం అనేది సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంది. ఇది కాకుండా రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండి అలసటగా ఉంటుంది. అందుకే మంచి పోషకాలు ఉండే ఆహారం తినడం ముఖ్యం. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం కచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి. అయితే ఉదయం బ్రేక్ పాస్ట్‌లో ఏయే ఆహార పదార్థాలు తినాలో ఒక్కసారి తెలుసుకుందాం.
1. గుడ్డు గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఆకలిని తీర్చడంలో సహాయపడుతుంది. మీరు అల్పాహారంలో గుడ్లు తినవచ్చు. బరువు తగ్గాలనుకుంటే గుడ్డు ఉత్తమ ఎంపిక. మీరు దానికి కొన్ని కూరగాయలను యాడ్ చేసుకొని తినవచ్చు. ఇవి తినడానికి తేలికగా ఉంటాయి మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి.
2. వోట్మీల్ వోట్మీల్ ఒక ఆరోగ్యకరమైన రుచికరమైన అల్పాహారం. ఇందులో తక్కువ కేలరీలు, ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ ఆహార కోరికలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. దీని వల్ల ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. కావాలంటే దీనికి కివి పండును యాడ్ చేసుకొని తినవచ్చు. ఇందులో విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
3. పెరుగు, పండ్లు పెరుగు రుచికరంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్రీక్ పెరుగులో సాధారణ పెరుగు కంటే ఎక్కువ ప్రోటీన్లు, తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. దీన్ని రుచికరంగా చేయడానికి మీరు స్ట్రాబెర్రీలు, అరటిపండ్లను ఉపయోగించవచ్చు.
4. స్మూతీ మీరు అల్పాహారం కోసం స్మూతీలను తీసుకోవచ్చు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటికి మీరు పండ్లు, డ్రై ఫ్రూట్‌లను మిక్స్ చేసుకొని తినవచ్చు. చియా విత్తనాలను కూడా కలుపుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపులోని గ్రెలిన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
5. అవోకాడో అవోకాడో ఒక సూపర్ ఫుడ్. దీనిలో మీరు తాజాగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, ఉప్పు, మిరియాలు కలుపుకొని తినవచ్చు. ఇది మీ ఆకలిని శాంతపరుస్తుంది. ఆహారం తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఇందులో మంచి కొవ్వు ఉంటుంది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.