- Telugu News Photo Gallery Science photos Space Perspective wants to take tourists on balloon rides to the stratosphere
Balloon Flight to Space: బెలూన్‌లో అంతరిక్ష ప్రయాణం.. అందులోనే సకల సౌకర్యాలు.. టికెట్ కాస్ట్ ఎంతంటే..?
ఇప్పటికే.. స్పేస్ టూరిజంలో.. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఈ రెండు సంస్థలు తమ బృందాలను.. అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. సురక్షితంగా తిరిగి భూమికి తీసుకొచ్చాయి. ఈక్రమంలోనే.. తాజాగా.. బెలూన్‌లో స్పేస్ సవారీ కూడా రెడీ అవుతోంది.
Updated on: Aug 06, 2021 | 9:31 PM

ఫ్లోరిడాకు చెందిన స్పేస్ పెర్స్పెక్టివ్... ఒక ప్రత్యేక స్పేస్ బెలూన్‌ను రూపొందించింది. ఈ బెలూన్‌ను.. మనుషులను తీసుకొని.. భూ వాతావరణ పరిధిని దాటి అంతరిక్షం వరకు వెళ్తుంది.

సుమారు లక్ష అడుగుల ఎత్తుకు.. కేవలం రెండు గంటల్లోనే తీసుకెళ్లగలదు. అక్కడికి చేరుకున్నాక... మరో రెండు గంటలు.. అంతరిక్ష అందాలను వీక్షించడానికి, ఆస్వాదించడానికి అనువుగా అక్కడే బెలూన్ చక్కర్లు కొడుతుంది.

ఈ స్పేస్ బెలూన్‌లో స్నానం చేయడానికి బాత్రూమ్, బార్, వై-ఫై సౌకర్యాలు కూడా ఉంటాయి. స్పేస్ బెలూన్ ద్వారా ప్రయాణించేటప్పుడు..., 360 డిగ్రీల దగ్గర భూమిని చూడవచ్చు.. అలానే.. బెలూన్లో ఏర్పాటు చేసిన కిటికీలు ద్వారా.. ప్రయాణికులు అంతరిక్ష సవారీని ఆస్వాదిస్తూ ఆ మధుర క్షణాలను మొబైల్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు.

ఈ స్పేస్ బెలూన్... 8 మందిని అంతరిక్షంలోకి తీసుకువెళ్తుంది. జూన్ చివరి వారంలో ఈ స్పేస్ ప్రయాణానికి నిర్వాహక కంపెనీ బుకింగ్స్ ఓపెన్ చేసింది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఈ స్పేస్ బెలూన్ జర్నీ కోసం రెడీ అయిపోయారు.

2024 వరకు అంతరిక్ష ప్రయాణానికి బుకింగ్‌లు జరిగాయని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు 2025 వరకు బుకింగ్ చేస్తున్నారు. కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు. అయితే.. ఈ స్పేస్ బెలూన్‌లో ప్రయాణించాలంటే.. ఒక వ్యక్తి.. జస్ట్ రూ. 93 లక్షలు చెల్లించి, సీట్ బుక్ చేసుకుని.. 2024 వరకు వేచి చూడండి.
