- Telugu News Photo Gallery Science photos American Robin secrets are not revealed yet after many experiments this small bird now linked with ISS
Bird Life: వరల్డ్ స్పేస్ స్టేషన్ నుంచి ఈ ‘చిన్ని పక్షి’ని పరీక్షిస్తున్నారు..ఎందుకో తెలుసా?
సృష్టిలో విచిత్రాలు లెక్కలేనన్ని. తవ్వుతూ పోవాలి కానీ దానికి అంతు ఉండదు. ఈ చిన్ని పక్షి గురించిన విశేషాలను తెలుసుకోవడానికి ఏకంగా వరల్డ్ స్పెస్ స్టేషన్ నుంచి మానిటర్ చేస్తున్నారు. ఎందుకో తెలుసుకోండి!
Updated on: Aug 06, 2021 | 9:52 PM

పక్షులలో అమెరికన్ రాబిన్ పక్షి తీరే వేరు. చిన్నగా ఉండే ఈ పక్షి సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది. ఇది ఎలా అంతదూరం అలుపు తెలియకుండా ఎగురుతుంది అనేదానిపై ఇప్పటికీ జంతుశాస్త్రవేత్తలకు ఒక స్పష్టత లేదు.

ఈ అమెరికన్ రాబిన్ పక్షి సుదూర తీరాలకు ఎగురుతూ పోవడమే కాదు..ఉత్తర అమెరికాలోని మధురమైన రాబిన్ అక్కడి వాతావరణ దూత కూడా. దాని మధురమైన స్వరం వసంతం రాకను సూచిస్తుంది. అమెరికాలో దీనికి సంబంధించిన ఏడు ప్రధాన జాతులు ఉన్నాయి. ఇది కొన్ని యూరోపియన్ దేశాలలో కూడా కనిపిస్తుంది.

దీని సంగతి పూర్తిగా తెలుసుకోవాలని పర్యావరణ శాస్త్రవేత్త ఎమిలీ విలియం వాటి కాళ్ళకు ఒక GPS ట్రాకింగ్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేసారు, ఇది దీని ప్రయాణాన్ని ట్రాక్ చేస్తుంది అలాగే దాని జన్యు సిద్ధాంతం అలాగే, పర్యావరణ భాగాలను కనుగొనగలదు.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పై యాంటెన్నా ద్వారా ఈ పరికరం రాబిన్‌ను ట్రాక్ చేస్తుంది. ఈ యాంటెన్నా రెండు సంవత్సరాల క్రితం స్టేషన్‌లో ఇన్‌స్టాల్ చేశారు. అయితే దాని విద్యుత్ సరఫరా, కంప్యూటర్‌లో లోపాల కారణంగా ఇది క్రియారహితంగా మారింది. దీనిని తాజాగా పునరుద్ధరించారు.

రాబిన్ శీతాకాలంలో 4500 కి.మీ. ప్రయాణం చేస్తుంది. ఇది టెక్సాస్ నుండి మెక్సికోకు ఇష్టమైన ప్రదేశాలకు వలసపోతుంది. రాబిన్ ట్రాకింగ్ పరికరాలు గతంలోనే ఇన్‌స్టాల్ చేశారు. ఇటీవల దీనిని ఉపగ్రహానికి కనెక్ట్ చేయబడిన ప్రస్తుత పరికరం 10 మీటర్ల వరకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.



