Side Effects of Almonds: ఈ 5 లక్షణాలు ఉన్నవారు బాదం అస్సలు తినకూడదు.. తిన్నారో పెను ప్రమాదం తప్పదు..!

Side Effects of Almonds: సాదారణంగా ఎవరిని అడిగినా ప్రతీ రోజూ ఉదయం నాలుగు నుంచి ఐదు బాదం పప్పులను తినమని సూచిస్తుంటారు. రాత్రి ఒక ఐదు బాదం పప్పులు నీటిలో నానబెట్టి..

Side Effects of Almonds: ఈ 5 లక్షణాలు ఉన్నవారు బాదం అస్సలు తినకూడదు.. తిన్నారో పెను ప్రమాదం తప్పదు..!
Almond
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 7:53 PM

Side Effects of Almonds: సాదారణంగా ఎవరిని అడిగినా ప్రతీ రోజూ ఉదయం నాలుగు నుంచి ఐదు బాదం పప్పులను తినమని సూచిస్తుంటారు. రాత్రి ఒక ఐదు బాదం పప్పులు నీటిలో నానబెట్టి.. ఉదయాన్ని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే, బాదంపప్పు తింటే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఇది అందరికీ కాదులేండి. ఒక ఐదు లక్షణాలు కలిగిన వ్యక్తులు బాదం పప్పులను అస్సలు తినకూడదని చెబుతున్నారు. అలా తింటే.. పెను ప్రమాదం పొంచిఉన్నట్లే అని హెచ్చరిస్తున్నారు.

మరి బాదం పప్పును ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మీకు బీపీ ఉందా? అందుకు సంబంధించిన ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా? అయితే, మీరు బాదం పప్పులు తినకూడదు. కారణం.. బాదంలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటును పెంచుతుంది. 2. మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు కూడా బాదం తినడం మానుకోవాలి. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ E అధికంగా ఉండటం వల్ల తలనొప్పి, అలసట, మైకం వస్తుంది. అందువల్ల, మైగ్రేన్ రోగులు బాదం పప్పులను చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. వీలైతే వాటిని తినడం మానేయటం ఉత్తమం. 3. కిడ్నీ స్టోన్ సమస్యలు ఉన్నవారు బాదం తినడం మానుకోవాలి. వాస్తవానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు బాదం పప్పులను తినొద్దని వైద్యులు స్పష్టంగా చెబుతారు. ఈ బాదం పప్పులో ఆక్సలేట్ ఉంటాయి. ఇది కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత పెంచుతుంది. 4. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులు బాదం తినడం కూడా మానుకోవాలి. బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ కారణంగా గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం, కడుపులో మంట మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంది. 5. అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే మీరు కూడా బాదం పప్పులను అస్సలు తినొద్దు. బాదంలో అధిక కేలరీలు, కొవ్వులు ఉంటాయి. ఇవి మీ ఊబకాయాన్ని మరింత పెంచుతాయి. అందుకే.. ఊబకాయులు బాదం పప్పులను తినడం మానేయాలి.

Also read: Andhra Pradesh: నాలుగేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన భర్త.. విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్న మహిళ..

Hyderabad City: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. చదువు నేర్పుతారని పిల్లలను పంపిస్తే..

Telangana Collectors: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. హైదరాబాద్ కలెక్టర్‌గా ఎల్. శర్మన్..

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ