AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punarnava-Ayurveda: డయాలసిస్ చేయాల్సిన సమయంలో కూడా ఈ ఆకు రసం తాగితే.. కిడ్నీ సమస్యలు దూరం

Atikamamidi Aaku: మన పూర్వీకులు చెప్పిన ఆహార నియమాలను పాటిస్తూ.. శారీరక శ్రమ చేసినంత కాలం మనుషులు ఆరోగ్యంగానే జీవించారు. ఎప్పుడైతే.. ఆధునికత పేరుతో ఆహారం తినే విషయం దగ్గరనుంచి అన్నిటిలోనూ మార్పులు చేసుకుంటూ..

Punarnava-Ayurveda: డయాలసిస్ చేయాల్సిన సమయంలో కూడా ఈ ఆకు రసం తాగితే.. కిడ్నీ సమస్యలు దూరం
Atikamamidi Aaku
Surya Kala
|

Updated on: Aug 12, 2021 | 8:55 AM

Share

Atikamamidi Aaku: మన పూర్వీకులు చెప్పిన ఆహార నియమాలను పాటిస్తూ.. శారీరక శ్రమ చేసినంత కాలం మనుషులు ఆరోగ్యంగానే జీవించారు. ఎప్పుడైతే.. ఆధునికత పేరుతో ఆహారం తినే విషయం దగ్గరనుంచి అన్నిటిలోనూ మార్పులు చేసుకుంటూ వచ్చాడో అప్పటినుంచే గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధుల సహా అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ఎప్పుడైనా పూర్వీకులు రోగాల బారిన పడితే.. పదిపైసలు ఖర్చు లేకుండా పెరటి మొక్కల వైద్యంతో ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొంది పది కాలాలు పదిలంగా ఉండేవారు. అవును మనం తినే ఆహార పదార్థాలు, పరిసరాల్లోని మొక్కల్లో ఎంతో అమూల్యమైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. వేలు, లక్షల రూపాయలు ఖర్చుచేసినా నయంకాని వ్యాధులను తగ్గించే అద్భుత లక్షణాలెన్నో ఉన్నాయి. అలాంటి ఒక ఔషధ మొక్క అటిక మామిడి తీగ. ఇది పల్లెల్లో విరివిగా పెరుగుతుంది.. దీనిని అంటుడు కాయ మొక్క అని కూడా అంటుంటారు.

ఈ అటిక మామిడి తీగ కిడ్నీ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా, వచ్చే అవకాశాలున్నా కింద చెప్పిన విధంగా వాడితే చాలు మీ కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చని ఆయుర్వేద నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తయారీ విధానం:

అటిక మామిడి తీగను తెంచుకుని ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి. 200 మి.లీ. నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై 5-10 నిమిషాలు మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో అటిక మామిడి తీగ ముక్కలను వేయలి. తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి. ఈ రసాన్ని రోజూ ఉదయం 50మి.లీ. నీటిని తాగితే కిడ్నీ సంబంధిత వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చు.

అటిక మామిడి తీగ ప్రత్యేకత:

* అటిక మామిడి తీగ ఊళ్లలో, చేలల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. * దీనిని సంస్కృత గ్రంథాలు పునర్వవగా పేర్కొనగా వృక్షశాస్త్ర శాస్త్రీయ నామం బొహేవియా డిప్యూస * కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఇంగ్లిష్ మందుల్లో దీనిని ఎక్కువగా వాడతారు. * కిడ్నీ సమస్యలపై ప్రత్యేకంగా పనిచేసే ఈ ఆకు రసం చేసుకుని తాగితే వ్యాధులు రావు, వచ్చినా పోతాయి. * దీనిని మిగిలిన ఆకు కూరల్లాగానే వండుకుని తింటే ఇంకా మంచిది. * కళ్ల నుంచి కాళ్ల వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. * కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకునే వారు సైతం దీనిని వాడొచ్చు. అటిక మామిడి రసం తాగుతూ డయాలసిస్ చేసుకుంటూ ఉండొచ్చు. * ఇది తాగడం వల్ల వారానికి 3సార్లు చేసే డయాలసిస్ క్రమంగా ఒక్కసారికి వచ్చి తర్వాత అవసరమే ఉండదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. * అన్ని కిడ్నీ సమస్యలకు ఇంగ్లిష్ మందులు వాడుతూ కూడా ఈ రసం తాగొచ్చు. కూర తినొచ్చు. అద్భుత ఫలితాలు ఉంటాయి.

Also Read: Teej Festival: హిందూ యువతులకు ముస్లిం యువకులు మెహందీ పెట్టకుండా చర్యలు చేపట్టిన క్రాంతి సేన