Sabudana Khichdi: రెగ్యులర్ టిఫిన్స్‌తో బోరు కొడుతుందా అయితే సగ్గుబియ్యం కిచిడీని ట్రై చేయండి.. తయారీ ఎలా అంటే
Sabudana Khichdi: భారతీయుల వంటిళ్లల్లో పోపుల పెట్టె తో పాటు కనిపించే మరో వస్తువు సగ్గుబియ్యం. అయితే ఈ సగ్గు బియ్యం ఒక పంట నుండి వచ్చిందని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటారు చాల మంది. కానీ నిజానికి ఇది కేవలం..
Sabudana Khichdi: భారతీయుల వంటిళ్లల్లో పోపుల పెట్టె తో పాటు కనిపించే మరో వస్తువు సగ్గుబియ్యం. అయితే ఈ సగ్గు బియ్యం ఒక పంట నుండి వచ్చిందని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటారు చాల మంది. కానీ నిజానికి ఇది కేవలం పరిశ్రమలలో తయారవుతుంది. ఈ సగ్గు బియ్యాన్ని దేశ వ్వాప్తంగా అనేక వంటకాలలో వాడు తుంటారు. కాని సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనే. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లది.
అయితే ఈ సగ్గు బియ్యంలో కొవ్వు, ప్రోటీన్లు ఉండవు. అంతేకాదు గ్లూటెన్ కూడా ఉండదు. అందుకనే ఈ సగ్గుబియ్యానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది. సగ్గుబియ్యంతో ఫైబర్ , కేలరీలతో సమృద్ధిగా ఉంటాయి. కనుక వీటిని మీరు దానిని ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారో అనే దాన్ని బట్టి, బరువు పెరగడానికి లేదా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. సగ్గుబియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు , మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇందులో ఖనిజాలు మరియు విటమిన్లు కూడా ఉంటాయి, అవి వివిధ శరీరం జీవ ప్రక్రియలకు సహాయపడతాయి. ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న సగ్గుబియ్యంతో కిచిడీ తయారీ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
సగ్గుబియ్యం ఉడికించిన బంగాళాదుంప టమాటా పచ్చి మిర్చి ఉప్పు అల్లం కరివేపాకు జీలకర్ర వేరుశెనగ నెయ్యి లేదా నెయ్యి
తయారీ విధానం:
ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని ముందుగా నీటిలో వేసి సుమారు మూడు గంటలు నానబెట్టాలి. తర్వాత స్టౌ పై బాణలి పెట్టి.. వేరుశనగపప్పుని వేయించి చల్లబరచాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాన్ వేడి చేసి రెండు నెయ్యి వేసుకుని జీలకర్ర, అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు, వేరుశనగలు, టమాటా వేసి.. వేయించాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపను ముక్కలుగా చేసుకుని వేయించిన పోపుల్లో వేసి.. కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి.. అనంతరం మిక్సీ చేసుకున్న వేరుశనగ పప్పుల పొడిని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని .. ఖిచిడీని కలుపుతూ ఉండాలి.. అలా కొంచెం సేపు వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది. అంతే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం ఖిచిడీ రెడీ.. వేడివేడిగా తింటే బాగుంటుంది.
Also Read: నాటకం ప్రదర్శిస్తున్న సమయంలో పద్యం పాడుతూ గుండెపోటుతో మృతి చెందిన కళాకారుడు