AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Stones-Ayurveda Tips: కిడ్నీలో రాళ్ల నివారణ కోసం ఈ వంటింటి చిట్కాలను పాటించండి ఉపశమనం పొందండి

Kidney Stones-Ayurveda Tips: కిడ్నీలో రాళ్లుఅనేవి చాలా సాధారణ సమస్య. ప్రస్తుతం వయసుతో పనిలేకుండా కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు సర్వసాధారణంగా మారిపోయింది. బ్లడ్ లో ఎక్కువ కాల్షియం ఉండడం లేదా..

Kidney Stones-Ayurveda Tips: కిడ్నీలో రాళ్ల నివారణ కోసం ఈ వంటింటి చిట్కాలను పాటించండి ఉపశమనం పొందండి
Kidney Stones
Surya Kala
|

Updated on: Aug 13, 2021 | 6:53 AM

Share

Kidney Stones-Ayurveda Tips: కిడ్నీలో రాళ్లుఅనేవి చాలా సాధారణ సమస్య. ప్రస్తుతం వయసుతో పనిలేకుండా కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు సర్వసాధారణంగా మారిపోయింది. బ్లడ్ లో ఎక్కువ కాల్షియం ఉండడం లేదా.. కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్లని ఎక్కువ రోజులు తీసుకోవడం, పాలకూర, నట్స్, చాకొలేట్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండడం, ఫైబర్, మెగ్నీషియం తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వంటి అనేక రీజన్స్ కిడ్నీ లో రాళ్లు ఏర్పడడానికి కారణం కావొచ్చు. అయితే ఎటువంటివారైనా సరే కిడ్నీలో రాళ్ల సమస్యనుంచి బయట పడాలంటే ఆయుర్వేదంలో చెప్పిన వంటింటి చిట్కాలు పాటిస్తే.. ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

*కిడ్నీ లో స్టోన్స్ కరగాలంటే ఒక స్పూన్ నిమ్మ రసం, తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరు నెలలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు నివారించబడటమే కాకుండా తిరిగి కిడ్నీలో రాళ్ళు వచ్చే సమస్యే ఉండదు. *నిమ్మ రసంలో సైంధవ లవణం కలుపుకొని తాగడం వలన మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి. *పుచ్చకాయలో నీరు, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన పుచ్చకాయ జ్యూస్ లేదా ముక్కల రూపంలో ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. *నీరు, నిమ్మరసం మిశ్రమంలో కొద్దిగా తేనె లేదా బెల్లం కలుపుకుని ప్రతి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయట. *కిడ్నీ లో స్టోన్స్ నివారణకు వారంలో ఒకసారి ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ కాని, దానిమ్మ గింజలు కాని తీసుకోవడం చాలా బెస్ట్ రెమిడీ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. *ప్రతి రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్ధాలు తొలిగిపోతాయి. *కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ రసాన్ని ఒడకట్టి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు యూరియన్ రూపంలో బయటకు పోతాయి. కిడ్నీలను శుభ్రపరచడానికి కొత్తిమీర సహజమైన ఔషధమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. *అలోవేర జ్యూస్ తాగితే మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడవని చెబుతున్నారు.

పైన చెప్పిన చిట్కాలు ఏవి అందుబాటులో ఉంటె వాటిని పాటిస్తూ.. రోజూ ఐదు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్స్ ఖచ్చితంగా కరిగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read: Chanakya Niti: పురుషులు 25 ఏళ్లలో నేర్చుకునే విషయాలను స్త్రీలు 16 ఏళ్లకే నేర్చుకుంటారు అంటున్న చాణక్య