Chanakya Niti: పురుషులు 25 ఏళ్లలో నేర్చుకునే విషయాలను స్త్రీలు 16 ఏళ్లకే నేర్చుకుంటారు అంటున్న చాణక్య

Chanakya Niti: చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, గొప్ప పండితుడైన ఆచార్య చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి అనేక విషయాలను తెలిపారు. జీవితం సుఖమయం చేసుకోవడానికి.. ఏ పనులు చేయాలి..

Chanakya Niti: పురుషులు 25 ఏళ్లలో నేర్చుకునే విషయాలను స్త్రీలు 16 ఏళ్లకే నేర్చుకుంటారు అంటున్న చాణక్య
Acharya Chanakya
Follow us
Surya Kala

|

Updated on: Aug 13, 2021 | 6:29 AM

Chanakya Niti: చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, గొప్ప పండితుడైన ఆచార్య చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి అనేక విషయాలను తెలిపారు. జీవితం సుఖమయం చేసుకోవడానికి.. ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు.. ఎలాంటి పనులు చేస్తే మనిషి కష్టనష్టాలను ఎదుర్కొంటామని ఆయన అనుభవంతో చెప్పినవి ఎన్నో ఉన్నాయి. అందుకనే చాణుక్యుడి చెప్పిన మాటలను నీతి సూత్రాలను ఆచరిస్తే.. జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్టనష్టాలనైనా ఎదుర్కోవచ్చు. అందుకనే చిన్నతనం నుంచే పిల్లలకు పెద్దలు.. మన ధర్మంలోని సూక్ష్మాలను మంచి విషయాలను నేర్పిస్తూ ఉండాలి. పెద్దలను గౌరవించడం దగ్గర నుంచి జీవితంలో ఎలా మసలుకోవాలనే విషయం వరకూ ఎన్నో విషయాల్లో పిల్లలకు మార్గదర్శంగా వ్యవహరిస్తారు. ఈరోజు చాణుక్యుడు స్త్రీ, పురుషుల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి చెప్పిన విషయాలను తెలుసుకుందాం.

స్త్రీణాం ద్విగుణ ఆహారో బుధ్ధిస్తానం చతుర్గుణా సాహసం షడ్గుణం చైవ కామోఒష్ణగుణ ఉచ్యతే

ఈ శ్లోకములో స్త్రీ నిందలేదు. స్త్రీ విమర్శకానీ ఏది లేదు.. ఇందులో స్త్రీ స్వభావస్థితి తెలుపబడింది. స్త్రీలు గర్భమును ధరించి బిడ్డల్ని కని పాలనిచ్చి పోషిస్తారు. అందుచేత వారి ఆహారము రెట్టింపుగా ఉంటుంది. స్త్రీకి బుద్ధి పురుషునికంటె నాలుగురెట్లు ఉంటుందంటే ఈ విషయం నేడు విద్యాలయాల్లో మహావిద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో మగపిల్లల కంటె ఆడుపిల్లలే ప్రథమస్థానల్లో ఉద్యోగాల్లో, కార్పొరేట్ కంపెనీలల్లో, అంతరిక్షణాల్లో మహిళలు అద్భుతమైన మెదస్సును కనబరుస్తూ వస్తున్నారు. పురుషుడు 25 సంవత్సరాలకు యువకుడౌతాడు. స్త్రీ 16 సంవత్సరములకు యువతి అవుతుంది. పురుషుడు 25 ఏళ్లలో ఎంతనేర్చుకుంటాడో స్త్రీ 16 సంవత్సరాలకే అంత నేర్చుకుంటుంది. దీన్ని బట్టి పురుషుని బుద్ధికంటె స్త్రీ బుద్ధి ఎక్కువని చాణుక్యుడు తెలిపారు.

చిన్నచిన్న దారాలతో స్త్రీలు స్వెట్టరు, బుట్టలు, తోరణాలు అల్లుతారు. దానిలో ఒక్క తప్పు కూడ ఉండదు. పిల్లలకు తినిపిస్తుంటారు, ప్రక్కవారితో మాట్లాడుతుంటారు, విషయాలను చర్చిస్తారు, ఇలా పలువిషయాలల్లో ఒకేసారి పాల్గొనగలగడం వల్ల వారిని నాలుగు రెట్లు బుద్ధి వున్నట్లు అర్థమౌతుంది. ఏ పురుషుడు కూడా ఇలా ఒకేసారి ఇంతపని చేయడం చాలా అరుదు. సహజంగా స్త్రీలు సాహస స్వభావము గలవారు కారు. ఒకవేళ సాహసించవలసి వస్తే పురుషున్ని మించి సాహసం చూపుతారు. శారీరక దృష్టితో స్త్రీ పురుషునికంటే ఎక్కువ అధికమైన కామం కలది అని చెప్పారు చాణుక్యుడు.

Also Read:  అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలం.. 25 మీటర్లు ముందుకొచ్చి బీభత్సం.. 20 ఏళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందట