Tirumala: శ్రీవారి దర్శన టిక్కెట్లు మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయం.. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూపీలాగడంతో గుట్టురట్టు

చివరికి కరోనా టైమ్‌లో కూడా అక్రమార్కులు...తమ తీరు మార్చుకోవడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను అసరాగా మార్చుకొని క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా విపత్తును

Tirumala: శ్రీవారి దర్శన టిక్కెట్లు మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయం.. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూపీలాగడంతో గుట్టురట్టు
Tirumala Darshan Tickets
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 12, 2021 | 9:44 PM

Tirumala Darshan Tickets: చివరికి కరోనా టైమ్‌లో కూడా అక్రమార్కులు…తమ తీరు మార్చుకోవడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను అసరాగా మార్చుకొని క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా విపత్తును దృష్టిలో ఉంచుకొని టీటీడీ పరిమిత సంఖ్యలోనే 300రూపాయల దర్శనం టిక్కెట్ల కోటాను రిలీజ్ చేస్తోంది. కాని శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా పోటీ పడుతుండటంతో…300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను సైతం మార్ఫింగ్ చేసి అమాయక భక్తులకు అమ్ముకుంటున్నారు కొందరు కేటుగాళ్లు.

హైదరాబాద్‌కు చెందిన భక్తులకు రెండు రూ.300 టికెట్లను 15 రెట్లు అధికంగా అంటే రూ.4,400 విక్రయించారు దళారులు. ప్రతిరోజూ టీటీడీ కేటాయించిన రూ.300 దర్శన టికెట్ల కంటే ఎక్కువమంది స్వామివారిని దర్శించుకుంటున్నట్లుగా అధికారుల దృష్టికి రావడంతో విచారిస్తున్నారు. ఇక్కడే ఈగుట్టు బయటపడింది.

శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు మార్ఫింగ్ చేసి భక్తులకు అమ్ముతున్నట్లుగా తేల్చారు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. ఇలా మార్ఫింగ్ చేసి విక్రయిస్తున్న నకిలీ టికెట్లపై విచారణ చేస్తున్నారు.ఇదంతా తిరుపతిలోని ట్రావెల్స్ నిర్వాహకుల పనిగా అనుమానిస్తున్న అధికారులు.

Read also: Sileru Beauty: ఆహ్లాదకరంగా ఆంధ్రా కశ్మీర్‌.. ప్రకృతి అందాలకు పర్యాటకులు ఫిదా..