Sileru Beauty: ఆహ్లాదకరంగా ఆంధ్రా కశ్మీర్‌.. ప్రకృతి అందాలకు పర్యాటకులు ఫిదా..

పచ్చని ప్రకృతిని చూడగానే అమ్మ ఒడిలో ఉన్నంత హాయిగా అనిపిస్తుంది. అటువంటి అందాలకు సీలేరు నెలవు. విశాఖ జిల్లా సీలేరులో కనువిందు చేసే సుందర దృశ్యాలకు కొదవలేదు.

Sileru Beauty: ఆహ్లాదకరంగా ఆంధ్రా కశ్మీర్‌.. ప్రకృతి అందాలకు పర్యాటకులు ఫిదా..
Sileru
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 12, 2021 | 7:05 PM

Sileru weather – Andhra tourism: పచ్చని ప్రకృతిని చూడగానే అమ్మ ఒడిలో ఉన్నంత హాయిగా అనిపిస్తుంది. అటువంటి అందాలకు సీలేరు నెలవు. విశాఖ జిల్లా సీలేరులో కనువిందు చేసే సుందర దృశ్యాలకు కొదవలేదు. ఈ అద్భుతమైన ప్రకృతి అందాలను చూడటానికి తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా పర్యటకులు తరలివస్తున్నారు. పచ్చని చీర కట్టినట్లుండే ఎత్తైన కొండలు.. వాటి నుంచి జాలువారే జలపాతాలు చూస్తుంటే.. ఇక్కడకు వచ్చిన వారి మనస్సు పులకరిస్తుంది. ఎటు చూసినా మనసు దోచుకునే మనోహర దృశ్యాలు చూపరులను అలరిస్తున్నాయి.

విశాఖ సముద్రమట్టానికి 4900 మీటర్ల ఎత్తులో ఉండే పచ్చని కొండలు.. మనసుదోచే సహజ సిద్ధమైన అందాలు.. వీటన్నిటి కలబోతే సీలేరు ప్రాంతం. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న మంచుతో.. దట్టంగా అలుముకున్న పొగమంచు విజువల్స్ చూసి మైమరచిపోతున్నారు పర్యాటకులు. చలికాలంలో కనిపించే సుందరమైన పొగమంచు దృశ్యాలు.. ఈ వర్షాకాలంలోనే కనిపించడంతో.. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి.

సీలేరులోని ప్రకృతి అందాలను చూసి మైమరిచిపోతూ.. గొప్పగా చెప్పుకుంటున్నారు పర్యాటకులు. కార్తీక మాసంలో వనభోజనాల కోసం ఇక్కడికి పెద్దసంఖ్యలో తరలివస్తారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు జలపాతాలు, కొండలు, కోనలతో పాటు గిరిజనుల ఆరాధ్య దేవాలయాలు.. ఈ అందాలతో పాటు మనకు కనువిందు చేస్తాయి. చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని సైతం చూడటానికి క్యూ కడుతున్నారు సీలేరుకు.

Read also: World Elephant Day: ఏనుగులకు కేకులు సహా పంచభక్ష్య పరమాన్నాలతో విందు.. నెహ్రూ జూ పార్క్‌లో పసందు.!