Teej Festival: హిందూ యువతులకు ముస్లిం యువకులు మెహందీ పెట్టకుండా చర్యలు చేపట్టిన క్రాంతి సేన
Teej Festival: ఉత్తర ప్రదేశ్ లో 'హర్తాళిక తీజ్' పండుగ సందర్భంగా ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తీజ్ పండుగకు ముందు.. హిందూ యువతులకు ఏ ముస్లిం యువకులు గోరింటాకు పెట్టకుండా చూడడానికి హిందూత్వ సంస్థ..
Teej Festival: ఉత్తర ప్రదేశ్ లో ‘హర్తాళిక తీజ్’ పండుగ సందర్భంగా ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తీజ్ పండుగకు ముందు.. హిందూ యువతులకు ఏ ముస్లిం యువకులు గోరింటాకు పెట్టకుండా చూడడానికి హిందూత్వ సంస్థ మంగళవారం ముజఫర్‌నగర్ మార్కెట్‌లో కవాతు చేపట్టింది. ప్రస్తుతం క్రాంతి సేన చేపట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియో లో క్రాంతి సేన కార్యకర్తలు స్థానిక మార్కెట్‌లో ‘చెకింగ్ డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. హిందూ మహిళలకు హెన్నా వేయడానికి ముస్లింలను నియమించవద్దని దుకాణదారులను కార్యకర్తలు కోరడం కనిపిస్తుంది. ఇదే విషయంపై క్రాంతి సేన ప్రధాన కార్యదర్శి మనోజ్ సైనీ మాట్లాడుతూ.. ” హిందూ మహిళలకు మెహందీని పెట్టడానికి ఏ ముస్లిం పురుషుడిని అనుమతించబోమని ఇప్పటికే తాము ప్రకటించామని చెప్పారు. అయితే తమ ప్రకటనను తీవ్రంగా తీసుకున్నారా లేదా అని తనిఖీ చేయడానికి… తాము మార్కెట్ ప్రాంతంలో చెకింగ్ డ్రైవ్ నిర్వహించామని చెప్పారు. అంతేకాదు తాము ప్రతి దుకాణానికి వెళ్లి వారి ఉద్యోగుల గురించి అడిగామని. హిందూ మహిళలకు ముస్లిం పురుషులు మెహందీ పెట్టిన దాఖలాలు లేవని తెలిపారు. దుకాణందారులు అబద్ధం చెప్పలేదని నిర్ధారించుకోవడానికి హిందూ ఉద్యోగులపై కూడా విచారణ జరిపామని ఆయన అన్నారు.
తాము ఈ డ్రైవ్ చేపట్టడానికి కారణం “ముస్లిం పురుషులు మెహందీని పెట్టె సాకుతో హిందూ మహిళలపై లవ్ జిహాద్ చేపడుతున్నారని.. ఇక నుంచి తాము అలా జరగనివ్వమని చెప్పారు. అందుకనే తాము ఈ విషయంపై దుకాణదారులకు విజ్ఞప్తి చేసాము. ” లవ్ జిహాద్” నుంచి హిందూ అమ్మాయిలను రక్షించడం తమ లక్ష్యం అని తెలిపారు. మేకప్, హెయిర్‌స్టైల్ వంటి ఇతర ఉద్యోగాల కోసం ముస్లిం పురుషులను నియమించవద్దని దుకాణదారులకు క్రాంతి సేన విజ్ఞప్తి చేసింది. ఇక నుంచి అటువంటి ఉద్యోగాల కోసం తాము ఏ ముస్లిం యువకుడిని నియమించబోమని దుకాణదారులందరూ తమకు హామీ ఇచ్చారు” అని క్రాంతి సభ్యుడు సేన చెప్పారు.
ఈ సంఘటనకు సంబంధించి ముజఫర్‌నగర్ ఎస్పీ అప్రిత్ విజయ్‌వర్గియా స్పందిస్తూ.. తమకు “ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. తమకు ఎవరైనా దుకాణం యజమానులు ఫిర్యాదు చేస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: Fire Accident: హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో సినిమా షూటింగ్ .. వాహనంలో డీజిల్ లీక్ అగ్ని ప్రమాదం