AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఏ దోస్తీ..హమ్ నహీ చోడెంగే ‘..మధ్యప్రదేశ్ లో బీజేపీ నేతల హంగామా ..పాటలతో హుషారెక్కిన ‘అసెంబ్లీ’ !

మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ఇతర బీజేపీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు,, ఎమ్మెల్యేలు తమ పార్టీ విభేదాలను పక్కన బెట్టి ఓ అనూహ్యమైన పార్టీలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వాస్ కైలాష్ సారంగ్ తో...

'ఏ దోస్తీ..హమ్ నహీ చోడెంగే '..మధ్యప్రదేశ్ లో బీజేపీ నేతల హంగామా ..పాటలతో హుషారెక్కిన 'అసెంబ్లీ' !
Bjp Leaders Singing Songs In Assembly In Madhyapradeh
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 12, 2021 | 10:02 AM

Share

మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ఇతర బీజేపీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు,, ఎమ్మెల్యేలు తమ పార్టీ విభేదాలను పక్కన బెట్టి ఓ అనూహ్యమైన పార్టీలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వాస్ కైలాష్ సారంగ్ తో బాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు కూడా “భుట్టా పార్టీ’పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తరచూ ప్రభుత్వాన్ని తన విమర్శలతో ఇరకాటాన బెట్టే..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ సైతం ఇందులో పాల్గొన్నారు. ‘షోలే’ చిత్రంలోని ‘ఏ దోస్తీ హమ్ నహీ ఛోడెంగే ‘ పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుండగా చౌహన్, విజయ్ వర్గీయ ఒకరికొకరు చేతులు పట్టుకుని ఈ పాటకు అనుగుణంగా ‘పర్ ఫామ్’ చేయడం విశేషం. ‘హమే తుమ్ సే ప్యార్ కిత్ నా’ అనే సాంగ్ కూడా ఈ పార్టీలో వినిపించింది. ‘మ్యూజికల్ షో ఆఫ్ యూనిటీ’ అంటూ పలువురు ఈ వీడియోను షేర్ చేశారు. ఇక సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్..1975 నాటి ‘షోలే’..చిత్రంలో అమితాబ్, ధర్మేంద్రల ఈ పాటను తన ట్విట్టర్ కి జోడిస్తూ..వారికి ట్యాగ్ చేశారు.

తాము యువమోర్చాలో ఉన్న రోజుల్లో పార్టీకి ఎలా సేవలు చేశామో, ఎంత సన్నిహితంగా ఉన్నామో, తమ స్నేహం ఇప్పటికీ చెక్కు చెదరలేదంటూ కైలాష్ విజయ్ వర్గీయ కూడా ఇదే సాంగ్ ని తన ట్విటర్ కి జోడించారు. కాగా అసెంబ్లీ భవనంలో ఈ భుట్టా పార్టీని నిర్వహించారు. శాసనసభలో ఈ విధమైన ఈవెంట్ ఎన్నడూ జరగలేదు. ప్రజాసమస్యలపై చర్చించి వాటి పరిష్కార మార్గానికి వేదికగా ఉపయోగపడే అసెంబ్లీని ఈ విధమైన కార్యక్రమాలకు వినియోగించుకుంటారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రభుత్వమా లేక పాత స్నేహాలను గుర్తుకు తెచ్చే కార్యక్రమాలు నిర్వహించే ఫంక్షన్ హాలా అని స్థానికులు విమర్శిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : షూటింగ్స్ లో డేంజర్ బెల్స్.. స్టన్నింగ్‌ స్టంట్‌ చేసేప్పుడు సీన్ రివర్స్ అయితే…?:Danger Bells In Shooting Live video.

 పవన్‌ బర్త్‌డే గిఫ్ట్.. దిమ్మదిరిగే రేంజ్‌లో సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తున్న రానా చిత్రయూనిట్..:Pawan kalyan Birthday Video.

 బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.

 రాంగ్‌ రూటులో వచ్చిన మహిళ..అంతలోనే ప్రమాదం.!రెప్పపాటులో రెండు కాళ్ళు పోయాయి..: Traffic Rules Video.