Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lovers Death: కారులోనే అగ్నికి ఆహుతైన ప్రేమజంట.. అసలేమైందంటే..?

Crime News: ఆమె నర్స్.. అతను డ్రైవర్.. వారిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామంటూ పెద్దలకు చెప్పారు. వారు అంగీకరించకపోవడంతో.. చివరకు

Lovers Death: కారులోనే అగ్నికి ఆహుతైన ప్రేమజంట.. అసలేమైందంటే..?
Lovers Death
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2021 | 11:01 AM

Crime News: ఆమె నర్స్.. అతను డ్రైవర్.. వారిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామంటూ పెద్దలకు చెప్పారు. వారు అంగీకరించకపోవడంతో.. చివరకు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమికులిద్దరూ కారు లోపల ఉండి.. నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదనే ఆవేదనతో ప్రేమికులు బలవన్మరానికి పాల్పడిన సంఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లా యెలంగూర్ తాలూకాలోని మాంబల్లి సమీపంలోని కినకహళ్లిలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని చెరువు వద్దకు చేరుకున్న ప్రేమికులు కొంతసేపు మాట్లాడుకున్నారు. అనంతరం కారు లోపల ఉండి.. కారుకు నిప్పటించుకుని మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రేమికులు మాంబళ్లికి చెందిన కాంచన (20), శ్రీనివాస్‌ (26)గా గుర్తించారు. కాంచన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తుండగా.. శ్రీనివాస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కారులోనే కూర్చొని కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరి శరీరాలు కాలి బూడిదయ్యాయి. చామరాజనగర్ ఎస్పీ దివ్య సారా థామస్ సంఘటానా స్థలాన్ని పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు.

మాంబల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే.. ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇంకా ఇరు కుటుంబాలను విచారించాల్సి ఉందని.. ఆ తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

Also Read:

Terrorist Arrested: జమ్మూకాశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది అరెస్ట్‌.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

Scorpion Festival: విచిత్రమైన సాంప్రదాయం.. తేళ్లతో సయ్యాటలు.. ఇలవేల్పుగా పూజలు

Covid-19 third wave: థర్డ్‌ వేవ్ ప్రభావమేనా..? పిల్లలపై కరోనా పంజా.. ఆ నగరంలోని తల్లిదండ్రుల్లో ఆందోళన

GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?