Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: రోడ్డు మధ్యలో రెండు కుక్కల కౌగిలింత.. కన్నీళ్లు పెట్టుకుంటున్న సోషల్ మీడియా..

One Photo Two Dogs: ఈనాటి ఈ బంధం ఏనాటిదో ఏనాడు పెనవేసి ముడివేసేనో..."మబ్బులు కమ్మిన ఆకాశం మనువుల కలిసిన మనకోసం కలువల పందిరి వేసింది తొలివలపుల చినుకుల చిలికింది.." అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన మధురమైన కావ్యం మనందరికి గుర్తు చేసింది.

Viral Photo: రోడ్డు మధ్యలో రెండు కుక్కల కౌగిలింత.. కన్నీళ్లు పెట్టుకుంటున్న సోషల్ మీడియా..
Two Brown Dogs
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 14, 2021 | 11:53 AM

కొన్ని ఫొటోలను చూస్తుంటే, ఒక చిత్రం వెయ్యి పదాలు కాదు వెయ్యి కావ్యాలు అనిపిస్తుంది. అలాంటి చిత్రాలు ఎన్నో సంగతులను బంధిస్తుంటంది.  అనేక రకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఫన్నీ వీడియోలు.. ఫోటోలు చాలా ఎమోషనల్‌వి  కూడా ఉంటాయి. అవి  ఆ తర్వాత ఫేమస్ అవుతాయి. ఇటీవల సోషల్ మీడియాలో రెండు కుక్కల  (Cute-Emotional Photos)చిత్రాన్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. రెండు కుక్కల ఈ ఫోటో లక్షలాది మందిని ఏడిపించింది. ఇందులో రెండు కుక్కలు కౌగిలించుకోవడం కనిపిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్న తీరు చూసి ప్రతి ఒక్కరి ఏడ్చేస్తున్నారు. వారు కుక్కల అందమైన చిత్రాలను చూశారు కానీ అలాంటి భావోద్వేగ చిత్రాన్ని చూడలేదు. ఈ ఫోటోను @woodwardSumer ట్విట్టర్‌లో షేర్ చేశారు. చిత్రంలో కనిపించే రెండు కుక్కలలో ఒకటి అతని స్వంత కుక్క హెన్రీ.

హెన్నీ తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మరోకరు కుక్కతో కలిసి వాకింగ్‌కు వచ్చారు. ఆ రెండు కుక్కలు పక్క పక్కనే రావడంతో రెండు గట్టిగా పట్టుకున్నాయి. మనుషులా రెండు కుక్కలు ఒకరినొకరు ఎలా కౌగిలించుకుంటున్నాయో నర్స్ నమ్మలేకపోయింది. అతను వెంటనే దానిని ఫోటో తీసి తన ట్విట్టర్‌లో షేర్ చేస్తుంటారు. అది చూసినప్పుడు కేవలం 17 వందల మంది అనుచరులతో అతని ఖాతాలో లక్షలాది లైకులు వచ్చాయి. ఇది కాకుండా ఇది వేలాది సార్లు రీట్వీట్ చేయబడింది.

భావోద్వేగానికి..

ఈ చిత్రం ప్రజలను చాలా భావోద్వేగానికి గురి చేసింది. దీనిపై చాలా మంది వ్యాఖ్యానించారు. ఈ చిత్రం తనను ఏడిపించిందని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. అదే సమయంలో ఒక వ్యక్తి కుక్కల మధ్య ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందని అభిప్రాయ పడ్డాడు. ఫోటో చూసిన తర్వాత అందరూ ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రం ప్రజలను ఏడిపిస్తోంది. ఏనాటి ఈ బంధమే అంటూ కామెంట్ పెట్టడంతో అవునంటున్నారు  అది చూసిన నెటిజనం.

ఈనాటి ఈ బంధం ఏనాటిదో ఏనాడు పెనవేసి ముడివేసేనో…”మబ్బులు కమ్మిన ఆకాశం మనువుల కలిసిన మనకోసం కలువల పందిరి వేసింది తొలివలపుల చినుకుల చిలికింది..” అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన మధురమైన కావ్యం మనందరికి గుర్తు చేసింది.

ఇవి కూడా చదవండి: TMC – BJP: ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. తేల్చి చెప్పిన దీదీ ప్రధాన అనుచరుడు.. ఇదో కొత్త రకం గేమ్..

FAKE CHALLAN SCAM: ఏపీలో సరికొత్త నకిలీ వైరస్.. ఇది సోకితే.. రాష్ట్ర ఖజానా శంకరగిరి మాన్యాలేనట.. ఫోకస్ పెట్టిన సీఎం జగన్