AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMC – BJP: ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. తేల్చి చెప్పిన దీదీ ప్రధాన అనుచరుడు.. ఇదో కొత్త రకం గేమ్..

ఇటీవలే TMCలో చేరిన BJP MLA ముకుల్ రాయ్‌కు పాతవాసన పోవడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలోనే BJP గెలుస్తుందని తేల్చి చెప్పిన వారం రోజుల్లోనే..

TMC - BJP: ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. తేల్చి చెప్పిన దీదీ ప్రధాన అనుచరుడు.. ఇదో కొత్త రకం గేమ్..
Mukul Roy
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 14, 2021 | 8:16 AM

Share

ఇటీవలే TMCలో చేరిన BJP MLA ముకుల్ రాయ్‌కు పాతవాసన పోవడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలోనే BJP గెలుస్తుందని తేల్చి చెప్పిన వారం రోజుల్లోనే మరోసారి అదే డైలాగ్ రిపిట్ చేశాడు. ఇటీవలే BJPలో నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో(TMC) చేరిన తపస్ రాయ్ ముకుల్ రాయ్ మరోసారి నోరుజారాడు. TMC అధికారంలోకి రావడంతో నెల రోజుల్లోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న ముకుల్‌ రాయ్‌ వివాదాస్పద వ్యాఖ్యతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణానగర్‌ నార్త్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే BJPనే గెలుస్తుందంటూ వారం వ్యవధిలోనే రెండు సారి కూడా అదే మాట కుండబద్దలు కొట్టి చెప్పారు. 2017లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMCని వీడి BJPలో చేరిన ముకుల్‌ రాయ్‌. ఈ ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుందని అంతా అంచనా వేశారు.. కానీ అది తలకిందులైంది.

ఆ తర్వాత కృష్ణానగర్‌ నార్త్‌ నియోజకవర్గం నుంచి BJP ఎమ్మెల్యేగా గెలుపొందిన ముకుల్‌ ఆ తర్వాత నెల రోజులకే TMCలో చేరారు. పార్టీ ఫిరాయించిన ముకుల్‌ను MLA పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ BJP డిమాండ్‌ కూడా చేస్తుండగానే.. మమతా బెనర్జీ ప్రభుత్వం ఆయనను రాష్ట్ర అసెంబ్లీలోని ప్రజా పద్దుల కమిటీ (PAC) ఛైర్మన్‌గా నియమించింది.

అయితే శుక్రవారం పీఏసీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయాన మాట్లాడుతూ.. కృష్ణానగర్‌ నార్త్‌ స్థానానికి ఉప ఎన్నికలు వస్తే BJP గెలుస్తుందని అన్నారు. ఇప్పుడు మీరు ఏ పార్టీ ఎమ్మెల్యే అని ప్రశ్నించగా బీజేపీ ఎమ్మెల్యేనని అన్నారు. అంతకుముందు ఆగస్టు 6 న నదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనూ ఉప ఎన్నికలు వస్తే బీజేపీ గెలుస్తుందని చెప్పారు.

అయితే, అయితే, అతను తప్పు తెలుసుకున్న వెంటనే, అతను తృణమూల్ కాంగ్రెస్ అని అర్ధం అని తప్పును సరిదిద్దుకున్నాడు. వెంటనే పొరపాటును గ్రహించిన ముకుల్‌… త్రిపురలో జరిగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అద్భుత ఫలితాలు సాధిస్తుంది అంటూ మాట మార్చారు. పార్టీ ఆదేశిస్తే అక్కడకు వెళ్లి టీఎంసీ గెలుపు కోసం పనిచేస్తానని అన్నారు.

ఇదే అంశంపై ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాన్షు స్పందించారు.  తన తండ్రి గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. అతని శరీరంలో రసాయన అసమతుల్యత కారణంగా తాను విషయాలు మరచిపోతున్నారని చెప్పారు. రాయ్ భార్య మరణం తర్వాత డిప్రెషన్‌తో బాధపడుతున్నానని  వివరించారు.

“మా నాన్న శరీరంలో విపరీతమైన సోడియం పొటాషియం అసమతుల్యత ఉంది. అది చాలా సమస్యలకు దారితీస్తోంది. అతను ప్రతిదీ మర్చిపోతున్నాడు. ఇది నా తల్లి మరణంతో ప్రారంభమైంది. మేము అతని ఆరోగ్యం గురించి నిజంగా ఆందోళన చెందుతున్నాము.”  ఇదిలావుంటే.. రాజకీయ వర్గాలు మాత్రం ఇది మమతా పొలిటికల్ గేమ్ అంటున్నాయి.

ఇవి కూడా చదవండి: Krishna District: ‘జామకాయ’ ఆ పసిపాప జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమేసింది

FAKE CHALLAN SCAM: ఏపీలో సరికొత్త నకిలీ వైరస్.. ఇది సోకితే.. రాష్ట్ర ఖజానా శంకరగిరి మాన్యాలేనట.. ఫోకస్ పెట్టిన సీఎం జగన్